Beauty tips to remove black skin

beauty tips, tips to remove tan, beauty tips remove tan, home remedies, tan home remedies, beauty home remedies, beauty tips news, healthy beauty tips, facial beauty tips

beauty tips to remove black skin

నల్లబడుతున్న చర్మం కాంతివంతంగా మెరువాలంటే...

Posted: 10/10/2014 06:50 PM IST
Beauty tips to remove black skin

సాధారణంగా ప్రతిఒక్కరు తమతమ కార్యకలాపాలను, ఇతర పనులను నిర్వహించుకోవడం కోసం బయట ప్రదేశాల్లో తిరుగుతుంటారు. ఆ సమయాల్లో సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారడం జరుగుతుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం నల్లబడటాన్ని ‘‘సన్ టాన్’’ అంటారు. సూర్యరశ్మిలోని హానికరమైన యూవీ కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల నల్లగా మారడం జరుగుతుంది. అలాగే వాతావరణంలో కాలుష్యం, ధుమ్ముధూళి చర్మం మీద పడటం వల్ల అవి చర్మం మీద తమ ప్రభావంతో నల్లగా మారుస్తాయి. అలాంటప్పుడు నల్లగా మారిన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా మెరుగుపరుచుకోవాలంటే కొన్ని హోమ్ రెమెడీస్ అందుబాటులో వున్నాయి.

1. బేకింగ్ సోడా పేస్ట్ : బేకింగ్ సోడాను నీళ్లలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నల్లగా మారిన ప్రదేశాల్లో దానిని అప్లై చేసుకోవాలి. ఇలా రోజుకొకసారి అమలుచేసుకుంటే.. త్వరలోనే మంచి ఫలితం లభిస్తుంది.

2. తేనే - నిమ్మరసం పేస్ట్ : సరిపడ పరిమాణంలో తేనె, నిమ్మరసాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన ప్రదేశాల్లో అప్లై చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. కీరదోసకాయ రసం : కొద్దిగా కీరదోసకాయ రసం తీసుకుని అందులో నిమ్మరసం, రోజ్ వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన ప్రదేశాల్లో అప్లై చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. నిమ్మరసం : నిమ్మరసాన్ని బాగా పిండుకున్న తరువాత అందులో కాటన్ బాల్స్ లేదా పత్తిని ముంచి.. దానిని నల్లగా వున్నప్రదేశాల్లో అప్లై చేసుకోవాలి. 5 నిముషాల బాగా మసాజ్ చేసుకొని, 15 నిముషాలవరకు వుంచుకోవాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.

5. శెనగపిండి : కొద్దిగా శెనగపిండి తీసుకుని.. అందులో పెరుగు, నిమ్మరసాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను నల్లగా మారిన ప్రదేశాల్లో బాగా మసాజ్ చేసుకోవాలి. బాగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. పసుపు : నిమ్మరసం, పచ్చిపాల్లో కొద్దిగా పసుపు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని నల్లగా వున్న ప్రదేశాల్లో అప్లై చేసుకుని, 10 నిముషాలవరకు బాగా ఆరబెట్టుకోవాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

7. కొబ్బరినీళ్లు : నల్లగా మారిన ప్రదేశాల్లో కొబ్బరి నీళ్లతో మర్దన చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. రోజుకు రెండుసార్లు చేసుకుంటే.. ఎఫెక్టివ్ గా వుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  tips to remove tan  healthy tips  telugu news  home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more