Okinoshima Island Allows Only Men Without Clothes to offer pray యునెస్కో గుర్తింపు పోందిన నగ్న పూజలు.. అనాధి అచారం..

Okinoshima island allows only men without clothes to offer pray

Okinoshima, Korean peninsula, 17th century shrine, 1904-05 Russo-Japanese war, centuries-old rituals, Japans Men Only Island, japanese culture, Munakata Taisha, Okinoshima, Shinto belief, south-west Japan, Shinto shrines

A sacred island in south-west Japan that bans women and where male visitors must strip naked before going ashore has been declared a UNESCO world heritage site

యునెస్కో గుర్తింపు పోందిన నగ్న పూజలు.. అనాధి అచారం..

Posted: 07/13/2017 05:58 PM IST
Okinoshima island allows only men without clothes to offer pray

అది జపాన్ లోని ఓ పరమ పవిత్రమైన ప్రాంతం.. అక్కడ వుంటే ఆలయంలోకి ప్రవేశం కేవలం కొందరికే. ఇకపై ఆ అదృష్టానికి కూడా అక్కడి వారే కాదు ప్రపంచంలో ఎవరికీ అనుమతి లేకుండా పోతుంది. ఇందుకు కారణం ఆ ప్రాంతం తాజాగా యునెస్కో చారిత్రాత్మక ప్రాంతంగా గుర్తింపు పోందిన నేపథ్యంలో ఆ పవిత్ర స్థలానికి వెళ్లాలని.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ ప్రాంతానికి వెళ్లాలంటే కేవలం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే అనుమతి. అందులోనూ కేవలం గంటల వ్యవధిలో అక్కడకు వెళ్లి తిరిగి రావాల్సివుంటుంది.

ఇంతకీ ఆ ప్రాంతమేదో, అంత ప్రవిత్ర ఎందుకో తెలుసా...

జపాన్ లోని వాయువ్య ప్రాంతంలో వున్న ద్వీపం అది. దాని పేరు ఒకినోషిమా. కుషు, కొరియన్ పెనిన్సూలా మధ్యన వాయువ్య దిశగా ఈ ద్వీపం నెలకొని వుంది. ఈ ద్వీపంలోని నెలకొన్న అలయాలలో దేవతామూర్తులను అరాధిస్తే.. తమకు ఎలాంటి అపదలు రానీయకుండా వారు కాపాడతారని అక్కడి ప్రజల అపార నమ్మకం. అంతేకాదు తమతో అటు చైనా.. ఇటు కొరియా దేశాలతో సత్సంబంధాలు బలపడతాయని కూడా అక్కడి వారు విశ్వాసం.

నాల్గవ శతాబ్దంలో చైనా, కొరియా దేశాలు జపాన్ ప్రాంతాన్ని అక్రమించుకోవాలని యత్నించాయన్న విషయం చరిత్ర పుటలు తిరగేస్తే స్పష్టమవుతుంది. అలా మరోమారు తమ ప్రాంతం ఎలాంటి అక్రమణలకు గురికాకుండా వుండాలంటే 17వ శతాబ్దం నాటి ఇక్కడి అలయాల్లో ఇలా ఏడాదికో పర్యాయం పూజలు నిర్వహించాల్సిందేనని అక్కడి వారి ప్రాగాఢ నమ్మకం. అప్పటి నుంచి ఇక్కడి ఆలయాలో మునకట తైషాకు చెందిన పండితులు అలయాల్లో పూజలు నిర్వహించడం ప్రారంభించారు.

17వ శతాబ్దం నాటి ఈ ఆలయాలు షింటో అలయాలుగా ప్రఖ్యాతి చెందాయి. అప్పటి నుంచి అవే అచారాల మధ్య ఏడాదికో పర్యాయం కేవలం గంటల వ్యవధిలో మాత్రమే అక్కడ పూజలు నిర్వహించే అచార్యులు వెనక్కివస్తారు. ఇలా చేయడం మూలంగా 1904=05 కాలంలో జరిగిన రష్యా-జపాన్ యుద్దంలో అమరులైన తమ నావికాదళ సైనికులకు ఆత్మలకు శాంతి చేకూరుతుందని అక్కడి వారు భావిస్తుంటారు.

ఈ ఆలయాల దర్శనానికి ఇదీ అచారమే...

ఇంతవరకు బాగానే వున్న ఇక్కడ మరో చిక్కుంది. ఈ ఆలయాల్లో దర్శనానికి వెళ్లేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సి వుంటుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించే స్థలం. అక్కడి అలయాల సందర్శనానికి కొన్ని దశాబ్ధాలుగా వస్తున్న అచారాల రిత్యా వాటిని పాటించాల్సి వుంది. ఈ అలయాల్లోకి కేవలం పురుషులను మాత్రమే అనుమతిస్తారు. అదీనూ అచారాలు పాటించిన వారిని మాత్రమే అనుమతిస్తారు.

ఆ ప్రాంతాన్ని పురుషులు సందర్శంచాలంటే వారి శరీరాలపై నూలుపోగు కూడా లేకుండా బట్టలన్నీ విప్పేసి నగ్నంగా సముద్రంలో ప్రయాణించి చేరుకోవాలి.. ముందుగా పూజారులు నడుస్తుండగా, వారిని వెంటే భక్తులు నడవాల్సి వుంటుంది. దీంతో ఈ పరమపవిత్రమైన స్థలానికి వచ్చి దేవతారాధనను చేసే భక్తులు తమ పాపాలను, దోషాలను, సముద్ర జలాల్లో శుద్ది చేసుకున్నట్లు అవుతుందని అక్కడి వారి భావన. అంతేకాదు. ఈ ద్వీపాన్ని తాకుతున్న సముద్ర జలంలో ప్రయాణించడంతో శరీరంలోని మలినాలు కూడా కొట్టుకుపోతాయని భక్తుల విశ్వాసం.

మహిళలను ఎందుకు అనుమతించరు.?

ప్రపంచంలోని అనేక పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో మహిళలకు అనుమతి లేనట్లుగానే ఇక్కడ కూడా మహిళలకు అనమతి లేదు. దీనిపై అక్కడి ప్రజలు మాత్రం  అడవారు బహిష్టులైన సమయంలో ఇక్కడి జలాల్లో ప్రయాణం చేస్తే.. అక్కడి నీరు, ద్వీపం, సహా అన్ని అపవిత్రం అవుతాయని.. దాంతోనే వారిని అనుమతించమని చెబుతున్నారు. కాగా మహిళలు కూడా నగ్నంగా సముద్రంలో ప్రయాణం చేయడం కష్టసాధ్యమని మన పెద్దలు ఇలాంటి నిబంధన పెట్టివుంటారని మరికొందరు అంటున్నారు.

ఇతర దేశ పర్యటకులను అనుమతి వుందా.?

తమ పరమ పవిత్రమైన ప్రాంతంలో జరిగే ఆలయ పూజలకు తమ ప్రాంతం వారికే అనుమతించాలని అక్కడివారు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ తమ ప్రాంతం కానీ వారు కానీ, విదేశాలకు చెందిన పర్యాటకులకు కానీ ద్వీప ప్రవేశానికి అనుమతించకూడాదని కూడా నిబంధన పెట్టుకున్నారు. బయటి వారు తమ ప్రాంతాన్ని సందర్శిస్తే.. ఆ ప్రాంతం పవిత్రత పోతుందని అక్కడి వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బయటి వారిని తమ ప్రాంతానికి అనుమతించబోమని ఒకినోషిమా దీవి ప్రజలు చెబుతున్నారు.

ఇప్పుడెలా వార్తల్లో నిలిచింది..?

యెనెస్కో చారిత్మాత్మక ప్రాంతంగా గుర్తింపు పోందిన ఒకినోషిమా ద్వీపానికి భారీ ప్రచారం లభించింది. దీంతో ఈ ప్రాంతానికి చారిత్రక గుర్తింపు లభ్యమైంది. దీంతో ఈ ప్రాంత దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీంతో అలయ పూజారులు మాత్రం రానున్న ఏడాది మే 27న జరిగే పూజలకు కేవలం 200 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే విపరీత ప్రచారం నేపథ్యంలో ఇకపై తమ ప్రాంతానికి చెందిన పూజారులను మాత్రమే అనుమతిస్తామని కూడా ఆలయ అర్చకులు తెలిపారు. ఇదిలావుండగా, చారిత్రక ప్రాంతాల జాబితాలో జపాన్ కు చెందిన 21 ప్రాంతాలు నమోదు కావడం విశేషరం.

ఇటీవల పోలండ్‌లో సమావేశమైన యునెస్కో హెరిటేజ్‌ కమిటీ తాజాగా ప్రకటించిన 33 ప్రదేశాల్లో ఒకినోషిమా ఒకటి. దీంతోపాటు భారత్‌లోని అహ్మదాబాద్‌ నగరంతోపాటు మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్లు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్‌ దీవుల్లోని టపుటపువాటీ అనే పొలినేషియన్‌ ట్రయాంగిల్‌ కూడా ఉంది. అలాగే, యూకేలో లేక్‌ డిస్ట్రిక్ట్‌, ఆఫ్రికా నుంచి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని వలొంగో వార్ఫ్‌ అనేవి కూడా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles