The special story on Bogatha Waterfalls | waterfalls in india | khammam district | best tourist spots

Bogatha waterfalls special story khammam district vajedu mandal

Bogatha Waterfalls, waterfalls in india, india best tourist spots, Bogatha Waterfalls story, Bogatha Waterfalls images, khammam district, india attract places, indias beautiful waterfalls, waterfalls in telangana, ap waterfalls

Bogatha Waterfalls special story khammam district vajedu mandal : The special story on beautiful Bogatha Waterfalls which is in bogatha village, vajedu mandal, khammam district. This is developed as famous tourist spots in telugu states.

ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపరచేసే ‘బోగత జలపాతం’

Posted: 07/02/2015 04:29 PM IST
Bogatha waterfalls special story khammam district vajedu mandal

తమ సహజసౌందర్యంతో చూపరులను కట్టిపడేసే ప్రకృతి అందాల్లో ‘జలపాతం’ ఒకటి. కొడకోనల నుంచి జాలువారే నీటిపొంగు ప్రతిఒక్కరని ఇట్టే కటిపడేస్తుంది. అక్కడి వాతావరణాన్ని ఎంతో రమణీయంగా మార్చేసి, పర్యాటకుల్ని తమవైపుకు ఆకర్షించుకుంటుంది ఈ జలపాతం. ప్రపంచవ్యాప్తంగా ఈ జలపాతాలున్న ప్రదేశాలు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయంటే.. వీటి ప్రాముఖ్యత అక్కడే తెలుసుకోవచ్చు. ఈ జలపాతాలు మన దేశంలోనూ కోకొల్లలు వున్నాయి. అలాంటివాటిల్లో ఎంతో అద్భుతంగా కనువిందు చేసే ‘బోగత జలపాతం’ ఒకటి.

బోగత జలపాతం విశేషాలు :

ఈ జలపాతం ఖమ్మం జిల్లా, వాజేడు మండలంలోని బోగత గ్రామంలో ఉంది. ఎంతో అద్భుతంగా వున్న ఈ ప్రదేశానికి చేరుకునే ప్రయత్నంలో పదిహేను కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు. దట్టమైన పచ్చని అడవుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన జలపాతం ఇది. ఖమ్మంజిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాజేడు మండలం కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ బోగత జలపాతం వుంది. జూలై నుంచి నవంబర్ వరకు ఇక్కడ భారీగా నీటి దూకుడు కనిపిస్తుంది.కొండకోనలనుంచి జాలువారే నీటి పొంగు బోగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది.

ఈ జలపాతం కారణంగా బోగత ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ జలపాతం సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు దేశవ్యాప్తంగా వుండే పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశానికి జూలై నుంచి నవంబర్ నెలల మధ్య పర్యాటకుల సంఖ్య అధికంగా వుంటుంది. వేసవిలో ఎండతాపం వల్ల ఈ జలపాతంలోని నీరు స్థాయి కాస్త తగ్గుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bogatha Waterfalls  Best tourists spots  beautiful locations  

Other Articles