Lord shiva abhishekam anointing life benefits different types of items

lord shiva, lord shiva temples, lord shiva anointing, lord shiva abhishekam, shiva abhishekam, shiva temples, shiva pooja, lord shiva pooja, lord shiva pooja methods, telugu pooja methods, shiva parvathy photos, lord shiva parvathy pooja

lord shiva abhishekam anointing life benefits different types of items : We can get more benefits by anointing lord shiva with different types of food. To know about what those food.. then read this full article.

శివునిని అభిషేకించడం వల్ల కలిగే ఫలితాలేమిటో తెలుసా..?

Posted: 03/11/2015 06:51 PM IST
Lord shiva abhishekam anointing life benefits different types of items

శివునిని ప్రతిఒక్కరు భక్తిశ్రద్ధులతో ప్రతిఒక్కరు ఎంతో ఆరాధంగా పూజిస్తారు. తమ కుటుంబం జీవితాంతం సుఖసంతోషాలతో వుండేలా దీవించమంటూ ఆయన్ను కోరుకుంటాం! కేవలం పూజించడం వరకు మాత్రమే కాదు.. ఆయనను రకరకాల పదార్థాలు, ద్రవపదార్థాల ద్వారా అభిషేకిస్తారు. పూర్వకాలం నుంచి హిందూ సంప్రదాయంలో అమలులో వున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.

ఇలా శివునిని అభిషేకించడం వల్ల పూర్వపాపాలు అన్ని తొలగిపోవడంతోపాటు సంతోషమైన జీవితాన్ని, వ్యాపారలావాదేవీల్లో మంచి లాభాలను పొందుతారని, జీవితంలో ఎదురయ్యే ప్రతిఒక్క సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పండితులు, జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

అంతేకాదు... ఏయే పదార్థాలతో శివునికి అభిషేకం చేస్తే.. అందుకు అనుగుణంగా మంచి ఫలితాలు లభిస్తాయని వాళ్లు చెబుతున్నారు. వాటిని తూచాతప్పకుండా పాటిస్తే.. ఖచ్చితంగా ఫలితాలను పొందవచ్చని అంటున్నారు. మరి.. అవేమిటో ఒకసారి మనం కూడా తెలుసుకుందామా..

1. నువ్వుల నూనె : ఈ నూనెతో శివుడిని అభిషేకిస్తే... అపమృత్యువు నశిస్తుంది.

2. ఆవుపాలు : ఈ పాలతో శివునిని అభిషేకిస్తే.. జీవితంలో వున్న కష్టాలన్నీ తొలగిపోయి, సర్వసౌఖ్యాలు ప్రసాదించబడుతాయి.

3. గరిక నీరు : ఈ నీటితో శివునిని అభిషేకిస్తే.. నష్టపోయిన ద్రవ్యం తిరిగి స్పష్టంగా పొందుతారు.

4. మెత్తని చెక్కర : ఈ చెక్కరతో శివునిని అభిషేకిస్తే.. జీవితంలో వున్న దు:ఖాలు నాశనం అయి, సంతోష జీవన విధానాన్ని పొందుతారు.

5. చెరకురసం : ఈ రసంతో శివునిని అభిషేకిస్తే.. ధనవ్యవహారాలలో వున్న సమస్యలు ఒక్కసారిగి తొలగిపోయి... ధనవృద్ది కలుగుతుంది.

6. ఆవు నేయి : ఈ నేయితో శివునిని అభిషేకిస్తే.. నష్టాలన్నీ తొలగిపోయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

7. పెరుగు : నిత్యం పెరుగుతో శివునిని అభిషేకిస్తే.. మంచి ఆరోగ్యంతోపాటు బలం, యశస్సు లభిస్తుందని శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lord shiva abhishekam  shiva anointing  hindu temples  

Other Articles