The falkirk wheel story making boat lift scotland

the falkirk wheel, the falkirk wheel story, the making falkirk wheel, the falkirk wheel making video, falkirk wheel boat lift, the falkirk wheel history, the falkirk wheel biography, the falkirk wheel wikipedia, scotland

the falkirk wheel story making boat lift scotland

పడవలనే పైకి లేపేసే అద్భుతమైన వంతెన!

Posted: 11/10/2014 01:17 PM IST
The falkirk wheel story making boat lift scotland

ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కళాఖండాలు ఏర్పడిన విషయం తెలిసిందే! ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా నిర్మాణాలు నిర్మించబడి వుంటాయి. అటువంటివాటిల్లో ‘‘ఫాల్కిన్ చక్రం’’ కూడా ఒకటి!  స్కాట్లాండ్ లో నిర్మింపబడిన ఈ అత్యద్భుతమైన వంతెన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పడవలనే పైకి లేపగలదు. ఇది చూడటానికి సాధారణ వంతెనలా వున్నా.. ఇందులో వున్న ప్రత్యేకత వల్లే ఇది ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దీనిని సందర్శించడానికి దేశవిదేశాల నుంచి కొన్ని లక్షల్లో పర్యాటకుల నిత్యం వస్తూ వుంటారు. అంతెందుకు.. 2014లో దీనిని సందర్శించిన పర్యాటకుల సంఖ్య సుమారు 50 లక్షలకంటే ఎక్కువగా దాటడంతో దీని ప్రత్యేకత మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంతరించుకుంది.

విశేషాలు :

1. దీని అసలు పేరు ‘‘ది ఫాల్కిన్ వీల్’’. ఇది స్కాట్లాండ్ లోని ఫాల్కిర్క్ అనే ప్రాంతానికి దగ్గరలో వుంది కాబట్టి దానికి ఆ పేరొచ్చింది. ఈ వంతెన పడవల్ని అమాంతం పైకి లేసి ఎత్తైన ప్రదేశానికి పంపే ఒక చక్రం. యావత్ ప్రపంచంలోకెల్లా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడింది కేవలం ఇదొక్కటే.

2. స్కాట్లాండ్ లో ఫోర్ట్, క్లైడ్ అనే రెండు కాలువలు వున్నాయి. అయితే ఒకటి కిందుంటే, మరొకటి చాలా ఎత్తయిన ప్రాంతంలో వుంది. దాంతో ఇక్కడ బోట్లను కాస్త పైకెత్తడానికి ఉపయోగించే ‘ల్యాక్స్’ వ్యవస్థ ద్వారా ఏర్పాటు సిద్ధం చేసి వీటిల్లో బోట్లు తిరిగేలా కార్యక్రమాలను చేపట్టారు. కానీ 1930లో వాటిని తీసేసి కాలువలను వేరు చేశారు. కానీ మళ్లీ వాటిని తిరిగి కలపాల్సి వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించడానికి 2002లో ఈ వంతెనను నిర్మించారు.

3. వంతెనపై భారీ బోట్లు తిరగడానికి వీలుగా ఒక కాలువను కట్టారు. వంతెనకు ఒకవైపు భారీ చక్రాన్ని అమర్చారు. దీన్ని ‘బోట్ లిఫ్ట్’ అంటారు. ఈ వంతెనలో ఈ చక్రానిదే ఎక్కువ ప్రాధాన్యత. ఇది క్షణాల్లో కింది కాలువలో వున్న పడవలను పైకి లేపగలదు.. అలాగే పైనున్న వాటికి కిందకి దింపగలదు.

4. బోట్ లిఫ్ట్ ప్రత్యేకత : పడవలు కాలువలో ప్రయాణం చేసిన అనంతరం తిరిగి ఈ చక్రంలోకి ఆగుతాయి. అప్పుడు ఆ చక్రం 79 అడుగుల ఎత్తు పడవలను లేపి, పైన వంతెనపై వున్న కాలువలోకి దింపుతుంది. ఈ చక్రం రెండువైపులా కలిపి 8 పడవలను మోయగలదు. 5 రౌండ్లు పూర్తయ్యాక తిరిగి ఇది దిశ మార్చుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : the falkirk wheel  scotland  the wonders of the world  telugu news  

Other Articles