Akshardham delhi temple wikipedia which is built without steel

akshardham temple, akshardham wiki, akshardham gandhinagar, akshardham delhi, akshardham delhi wiki, akshardham delhi wikipedia, akshardham delhi story, akshardham delhi built, akshardham delhi temple news, akshardham temples, former president abdul kalam, former prime minister manmohan singh, temples in india, hindu temples, hindu temples in india

akshardham delhi temple wikipedia which is built without steel

ఉక్కు లేకుండా నిర్మించిన హిందూ దేవాలయాల సముదాయం

Posted: 11/07/2014 04:18 PM IST
Akshardham delhi temple wikipedia which is built without steel

అక్షరధామ్... భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఎంతో అద్భుతంగా నిర్మించబడిన ఓ చారిత్రాత్మక కట్టడం! ‘‘అక్షరధామ్’’ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం పూర్తిపేరు ‘‘స్వామి నారాయణ్ అక్షరధామ్’’. దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన ఈ హిందూ దేవాలయాల సముదాయం... నవంబర్ 7, 2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. అయితే 8వ తేదీ నుంచి ప్రజలకు దర్శనీయప్రదేశంగా దీనిని తెరవడం జరిగింది. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో ‘‘నొయిడా క్రాసింగ్’’ వద్ద యమునా నది తీరాన ఎంతో మహొన్నంతంగా వెలసింది.

నిర్మాణం :

రాజస్తాన్ ‍లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి కొన్ని వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు , పాలరాళ్ళను సేకరించడం జరిగింది. దీని నిర్మాణం కోసం అప్పట్లో చాలా సమయమే పట్టింది. అయితే ఈ నిర్మాణంలో విశేషమేమిటంటే.. ఈ కట్టడంలో ఒక్క అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడమే పెద్ద విచిత్రంగా మారింది. సాధారణ ఇళ్ల నిర్మాణానికే ఉక్కు వాడకం ఎంతో అవసరం. అటువంటిది ఇంత పెద్ద దేవాలయాల సముదాయంలో అస్సలు ఉక్కే వాడలేదు. అయినా ఇది ఎంతో దృఢంగా, అద్భుతంగా నిర్మించబడింది. అయితే ఈ అక్షరధాంని వైదిక స్థపత్య శాస్త్రాల (భవన నిర్మాణ కళకు సంబంధించిన) నిబంధనలమేరకే మలచడం ఒక విశేషం.

నిర్మాణశైలి :

వందఎరకాల భూభాగంలో నిర్మించిన బడిన ఈ కట్టడం భక్తిద్వార్, మయూర్ ద్వార్ అనే రెండు పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది. అక్షరధామ్ స్మారక భవనం, పలు గుమ్మటాలతో 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో, 370 అడుగుల నిడివితో నిర్మితమైంది. ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల ‘‘పరిక్రమ’’ స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టి వుంటుంది. దాని నిడివి దాదాపు రెండు కిలోమీటర్లు. 145 కిటికీలతో , 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

141 అడుగుల ఎత్తుతో అలరారే అక్షరధామ్ ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ మూర్తి చెప్పుకోదగింది. ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఆలయంలో నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, కవులు, శిల్పకారుల చిత్తరువులు ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ స్వామి నారాయణ్ అక్షరధామ్ ని ప్రముఖ్ మహరాజ్ నిర్మించారు. న్యూఢిల్లీలోని ఈ ఆలయాన్ని 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్ జాతికి అంకితం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshardham temples  new delhi  indian temples  abdul kalam  manmohan singh  

Other Articles