2016 సివిల్స్ టాపర్ గా నిలిచిన టీనా డబి | 2016 Civils topper Teena Dabi

2016 civils topper teena dabi

Teena Dabi, Teena, Civils, Civils Topper, Civils Results, haryana, UPSC, టీనా డబి, టీనా, సివిల్స్, యుపిఎస్సీ

a 22 years old girl from Delhi, topped the prestigious civil services exams 2015, conducted by the Union Public Service Commission or UPSC. In the second position was Athar Aamir Ul Shafi Khan from Jammu and Kashmir. Jasmeet Singh Sandhu, who is also from Delhi, has secured the third position. Get here more information about Teena Tina Dabi wiki and bio.

2016 సివిల్స్ టాపర్ గా నిలిచిన టీనా డబి

Posted: 05/13/2016 03:37 PM IST
2016 civils topper teena dabi

ఇండియాలో ఉన్న రాజ్యాంగపరమైన పదవుల్లో ఎంతో ఉన్నతమైనవి సిలిల్స్. అలాంటి సివిల్స్ లో మొదటి అటెంప్ట్ లోనే దేశంలో నెంబర్ వన్ ర్యాంకును సాధించిన టీనా అందరికి ఆదర్శం. అందుకే ఆమె గురించి ఆణిముత్యాలుగా అందిస్తున్నాం.  భోపాల్‌లో పుట్టిన టీనా... తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడే కుటుంబం ఢిల్లీకి షిఫ్ట్‌ అయ్యింది. తల్లి హిమాలీ దాబి ఇంజనీర్‌. తండ్రి జశ్వంత్‌ దాబి టెలికామ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. ఇద్దరూ ఇంజనీరింగ్‌ చదివినవారే అయినా కూతురిని మాత్రం సోషల్‌సైన్సెస్‌ వైపు ప్రోత్సహించారు. జీసస్‌ అండ్‌ మేరీ కాన్వెంట్‌లో టెంత్‌ వరకు చదువుకుంది. 2011లో లేడీ శ్రీరామ్‌ కాలేజీలోచేరిన టీనా బికామ్‌ డిగ్రీ చేసింది. అక్కడ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది. ఆ తరువాత అదే కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసింది. స్కూల్‌ డేస్‌ నుంచే భారత రాజ్యాంగం, రాజకీయాలు అంటే అంటే ఆసక్తిని పెంచుకుంది. ఆ ఆసక్తి... పీజీ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాల్లోనే తేలిపోయింది. ఆ సంవత్సరం పొలిటికల్‌ సైన్స్‌లో ఢిల్లీ యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది టీనా. యూపీఎస్సీ పరీక్షల కోసం ఒక ఏడాది పాటు సాధన చేసింది. అయితే అప్పటికే ఆమెకు అందుకు సరిపడా వయసు లేకపోవడంతో 21దాటేవరకు వేచి చూసింది.

తల్లిది మహారాష్ట్ర... తండ్రిది రాజస్థాన్‌. టీనా ఢిల్లీ గాళ్‌. తన ప్రిఫరెన్స్‌ క్యాడర్‌ మాత్రం హర్యానాని ఎంచుకుంది. ఎందుకు అంటే... 'ఎంతో ఆర్థిక ప్రగతి ఉన్న ఆ ప్రాంతంలో.. సామాజిక స్థితిగతుల్లో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదు. అది చాలా పెద్ద వైరుధ్యం. నిజానికి హర్యానా వెనుకబాటు తనానికి ప్రధాన కారణం... పితృస్వామిక మనస్తత్వం, లింగవివక్ష. ప్రగతిశీల భావాలున్న కుటుంబం నుంచి వ్యక్తిగా, ప్రతిష్టాత్మక లేడీ శ్రీరామ్‌ కాలేజీ విద్యార్థినిగా నాకు అది కచ్చితంగా పనిచేయాల్సిన అంశంగా అనిపించింది. ఆ పరిస్థితుల్లో కొంతైనా మార్పు తీసుకురాగలిగితే చాలు. అందుకే నా ఎంపిక హర్యానా' అంటోంది టీనా.

'సివిల్‌ సర్వీసెస్‌చదివించాలన్నది మా తల్లిదండ్రుల నిర్ణయం. అందులో రాణించగలనని వాళ్ల నమ్మకం. అందుకే చిన్ననాటినుంచే వాళ్లు నన్ను ఆవైపు ప్రోత్సహించారు. కొంత రీసెర్చ్‌ చేసిన తరువాత... నేనేం కావాలన్నది నాకూ తెలిసొచ్చింది. దాంతో రోజుకు ఎనిమిది నుంచి 10 గంటలు చదివేదాన్ని. వ్యూహాత్మకంగా, పథకం ప్రకారం చదవడం, ప్రణాళిక వేసుకోవడం, వారానికో టార్గెట్‌ పెట్టుకుని క్రమశిక్షణతో ఫోకస్‌డ్‌గా చదవడం వల్లే ఇది సాధ్యమయ్యింది. అంత మాత్రాన ఫ్రెండ్స్‌ని దూరం చేసుకోలేదు. ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండేదాన్ని. సినిమాలు కూడా బాగా చూసేదాన్ని' అని చెబుతోంది ఇంగ్లీష్‌ సీరియల్స్‌ అంటే ఇష్టపడే టీనా. టీనా మధుబని ఆర్టిస్టు. ఇంగ్లిష్‌ నావలిస్ట్‌ జేన్‌ ఆస్టిన్‌కి అభిమాని. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా తన తల్లిదే అంటుంది టీనా. 'నా కలలను నిజం చేసేందుకు ఎంతో తాగం చేసింది. ఆమే నా రోల్‌ మోడల్‌' అని గర్వంగా చెబుతుంది.

ఒత్తిడి ఉండకూడదు..
 'రిజల్ట్స్‌ తెలిసి చాలా సంతోషించాం. మెరిట్‌ లిస్ట్‌లో తన పేరు ఉంటుందని మాకు తెలుసు. కానీ టాపర్‌ తనే అవుతుందని ఊహించలేదు. తల్లిగా నాకెంతో ఆనందంగా ఉంది. తానేం కావాలనుకున్నదో అదే చేసింది. గొప్ప ఫలితాలు అద్భుతంగానే ఉంటాయి. పిల్లలు వాళ్లు చదువుతున్న చదువులో వాళ్లు ఎంజారు చేయగలగాలి. తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఒత్తిళ్ళూ ఉండకూడదు' అంటుంది టీనా తల్లి హిమాలి. 'సివిల్స్‌ టాప్‌లో నిలిచిన అక్కే హీరో ఇప్పుడు. నాకు చాలా గర్వంగా ఉంది. ఆమే నాకు స్ఫూర్తి' అని చెబుతుంది టీనా చెల్లెలు రియా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh