The Biography Of Famous Telugu Comedian Allu Rama Lingaiah | Tollywood Industry

Allu rama lingaiah biography famous telugu comedian tollywood industry

Allu Rama Lingaiah biography, Allu Rama Lingaiah history, Allu Rama Lingaiah life story, Allu Rama Lingaiah movies, Allu Rama Lingaiah news, Allu Rama Lingaiah awards, Allu Rama Lingaiah filmography, Allu Rama Lingaiah wikipedia, Tollywood, Telugu Film Industry

Allu Rama Lingaiah Biography Famous Telugu Comedian Tollywood Industry : The Biography Of Allu Rama Lingaiah Who Is A Famous Comedian In Tollywood Industry And Appeared in over two hundred films.

మూడుతరాల సినీ ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు

Posted: 07/31/2015 03:45 PM IST
Allu rama lingaiah biography famous telugu comedian tollywood industry

తెలుగు చలనచిత్ర రంగం తొలినాళ్లలో తమ ప్రతిభతో ప్రత్యేక ఇమేజ్ గడించిన ప్రముఖ నటీనటుల్లో ‘అల్లు రామలింగయ్య’ ఒకరు. వెండితెరపై హాస్యం పండించడంలో దిట్టైన తారల్లో ఈయన పేరే ముందుగా వినిపిస్తోంది. తన హావభావాలతో, సన్నివేశాలకు తగ్గట్టు చెప్పే డైలాగ్ డెలివరీ ప్రతిఒక్కరినీ కడుపుబ్బా నవ్వించాయి. ఇండస్ట్రీలో ఇంకా ఎంతోమంది హాస్యనటులు వచ్చారు కానీ.. ఈయన స్థానానికి ఎవరూ చేరుకోలేకపోయారు. చారిత్రకకాలంలో తెనాలి రామలింగడు పలు ప్రక్రియలతో కవ్వించి, నవ్వించి ఏ విధంగా ‘వికటకవి’గా పేరుగాంచాడో.. అలాగే మూడుతరాల సినీప్రేక్షకుల్ని తన హాస్యంతో కవ్వించిన అల్లు రామలింగయ్య కూడా సీనిరంగంలో ఆ స్థానాన్ని పొందారు.

జీవిత విశేషాలు :

1992 అక్టోబర్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఈయన తన బాల్యం నుంచే ఆకతాయిగా వుంటూ.. అందరినీ అనుకరిస్తూ న్వవించేవారు. అదే ఆయన్ను నాటకరంగంలో ప్రవేశించేలా చేసింది. ఊళ్లోకి నాటకాలు వేయడానికి ఎవరు వచ్చినా.. అల్లు వారివెంటే తిరిగేవారు. వాళ్లతో స్నేహం పెంచుకుని, తమ నాటకాల్లో ఏదైనా చిన్న వేషం ఇప్పిని అడగడం అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ‘భక్త ప్రహ్లాద’ నాటకంలో ‘బృహస్పతి’ వేషం వేసే అవకాశం రాగా.. తన ప్రతిభతో అందరినీ మెప్పించాడు.

అలా నటించేందుకు ఆయన మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా మాట్లాడుకుని, ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసారు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి, వాటిని అమ్మి, నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా ఆ విధంగా ఈయన నట జీవితం మొదలైంది. అంతేకాదు.. ఆయన నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. మరోవైపు అంటరానితనంపై పోరు చేశారు.

చలనచిత్ర జీవితం :

ఓ సందర్భంలో అల్లు నాటకాలు చూసి.. గరికపాటి రాజారావు తొలిసారిగా 1952లో ‘పుట్టిల్లు’ చిత్రంలో ఆయనకు ఓ పాత్ర ఇచ్చాడు. ఆ సినిమాతో ఆయన సీనిప్రస్థానం మొదలయ్యింది. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ‘వద్దంటే డబ్బు’లో అవకాశం వచ్చింది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో తననుతాను నిలదొక్కుకోవడానికి ఈయనకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచారు. ఈయన నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి.. ‘మూగమనసులు’, ‘దొంగరాముడు’, ‘మాయా బజార్’, ‘ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’ మొదలైనవి.

‘ముత్యాలముగ్గు’ సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా.. ఆ బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు రామలింగయ్య. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు. యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ, నవ్విస్తూ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన ఈయనకు ఎన్నో గౌరవాలు, అవార్డులు లభించాయి. భారత ప్రభుత్వం 1990లో ‘పద్మశ్రీ’, 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ‘రఘుపతి వెంకయ్య’ అవార్డులతో గౌరవించాయి. 2004 జూలై 31వ తేదీన తన 82వ ఏట కన్నుమూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Rama Lingaiah  Tollywood  Telugu Comedian  

Other Articles