Jayashankar prasad biography famous hindi literature

jayashankar prasad biography, jayashankar prasad news, jayashankar prasad history, jayashankar prasad life story, jayashankar prasad wikipedia, jayashankar prasad stories, jayashankar prasad peots, jayashankar prasad books, jayashankar prasad songs

jayashankar prasad biography famous hindi literature : jayashankar prasad is one of the famous hindi literature who wrotes stories, poets etc.

ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రసిద్ధ చెందిన కవి

Posted: 01/31/2015 05:49 PM IST
Jayashankar prasad biography famous hindi literature

కవిత్వాల్లో సరికొత్త మెరుపులు దిద్ది ఆధునికయుగానికి తగ్గట్టు రచనలు రచించిన కవులలో జయశంకర్ ప్రసాద్ ఒకరు. మనసుకు హత్తుకునే (మార్మిక) కవిత్వంగా వర్ణింపబడిన ఆయన శైలి.. హిందీ సాహిత్యంలో ఛాయావద్’కు నాలుగు స్థంభాల్లో ఒకటిగా పరిగణింపబడుతున్నారు. కళ, తత్వశాస్త్రాలు ఆయన రచనల్లో ఎంతో అద్భుతంగా మిళితమై వుంటాయి. ఆయన రాసిన దేశభక్తి పద్యాల్లో ఒకటైన ‘హిమాద్రి తుంగ్ ప్రింగ్ సే’ అనే పద్యం భారత స్వాతంత్ర్య ఉద్యమయుగంలో ఎంతోమంది ప్రశంసలను అందుకుంది. ఇలా ఆయన అనేకరకాల రచనాల ద్వారా అత్యంత ప్రసిద్ధ కవిగా పేరొందారు.

జీవిత చరిత్ర :

1889 జనవరి 30వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జన్మించారు. బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో ఈయనకు ఎన్నో కుటుంబసమస్యలు ఎదురయ్యాయి. దీంతో 8వ తరగతి తర్వాత పాఠశాల చదువును ఆపేశారు. అయితే.. సాహిత్యం, భాషలు, పురాతన చరిత్రపై ఆయనకు ఎక్కువగా ఆసక్తి వుండటంతో వాటిని ఇంట్లోనే చదవడం కొనసాగించారు. అలా ఆ విధంగా ఆయనకు వేదాలపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. పురాతన అవశేషాలను అధ్యయనం చేయడంపై ఆసక్తి వుండేది. వాటిని బాగా నెమరుకోవడం వల్ల ఈయన కవిగా మారారు.

కేవలం కవిగానే కాదు.. ఒక తత్వవేత్తగా, చరిత్రకారుడిగా, శిల్పిగా కూడా ఈయన మంచి గుర్తింపు పొందారు. కాల్పనిక సాహిత్యం నుంచి జాతీయవాద సాహిత్యం వరకు చెందిన అంశాలన్నీ ఆయన కవిత్వానికి కర్తగా వున్నాయి. సాంప్రదాయక హిందీ కవిత్వ సారాంశాన్ని సూచించే బాటలో ఆయన నిలిచారు. ఈయన రాసిన రచనలన్నింటిలోనూ కామాయణి అత్యుత్తమ రచనగా నిలిచిపోయింది. ఇది వివిధ రకాల అంశాల గురించి వర్ణిస్తున్నప్పటికీ... రూపక శైలిలో మానవ సంస్కృతి అభివృద్ధిని వివరిస్తుంది.

ఇక హిందీలో ఆయన నాటకాలు మార్గదర్శక రచనలుగా పరిగణించబడుతున్నాయి. అంతేకాదు.. ఈయన కథానికలు కూడా రాశారు. చారిత్రక, పురాణ అంశాల నుంచి సమకాలిన, సామాజిక అంశాలు వీటికి నేపథ్యాలుగా నిలుస్తాయి. కథలు, రచనలు, కవిత్వాలు.. ఇలా అన్నింటిలోనూ తనదైన రచనాప్రతిభను చాటిన ఈయన.. ప్రసిద్ధ కవిగా ప్రత్యేక ముద్రను సాధించారు. ఆరోగ్య కారణాల రీత్యా 1937 జనవరి 14వ తేదీన జయశంకర్ ప్రసాద్ మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayashankar prasad  hindi literatures  

Other Articles