Madan mohan malavya indian freedom fighter special story

madan mohan malavya special story, madan mohan malavya biography, madan mohan malavya bharat rathna, malavya special story, recent bharat ratna awardees, madan mohan malavya indian freedom fighter

indian freedom fighter madan mohan malavya got india higher civilian award bharat rathna from indian government special story

మదన్ మోహన్ మాలవ్యా భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త.

Posted: 12/27/2014 03:26 PM IST
Madan mohan malavya indian freedom fighter special story

భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ" గా కూడా పిలువబడుతున్నారు. ఆయన "మహాత్మా" గా కూడా గౌవరింపబడ్డాడు. మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.

మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు" కు ఒక వ్యవస్థాపకుడు. ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్ కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.

మాలవ్య 1861, డిసెంబరు 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మూనాదేవి మరియు బ్రిజ్ నాథ్ లు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు. అందువలన వారు "మాలవీయ" గా పిలువబడతారు. అందువల్ల వారి యింటిపేరు "వ్యాస్"గా అయింది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటిపురోహితులుగా యున్నారు. ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించేవాడు. మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు.ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. మాలవ్యా తన విద్యాభ్యాసాన్ని హరదేవా ధర్మ జ్ఞానోపదేశ పాఠశాలలో కొనసాగించాడు. అచట ఆయన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.ఆ తరువాత ఆయన వైదవర్థిని సభ నదుపుతున్న పాఠశాలలో చేరాడు. ఆ తరువాత అలహాబాదు జిల్లా పాఠశాలలో చేరారు. అచట ఆయన "మకరంద్" అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించాడు. ఆ కవితలు వివిధ జర్నల్స్ మరియు మ్యాగజెన్లలో ప్రచురితమైనాయి.

మాలవ్యా 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది.హారిసన్ కాలేజి ప్రిన్సిపాల్ మాలవ్యాకు నెలసరి ఉపకార వేతనాన్ని అందించేవారు. మాలవ్యా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. లో పట్టభద్రులైనారు. ఆయన సంస్కృతం లో ఎం.ఎ చేయాలనుకున్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆయన తండ్రి ఆయనను కూడా తన వృత్తిలోనికి సహాయకునిగా తీసుకుని వెళ్ళేవాడు. జూలై 1884 లో మదన్ మోహన్ మాలవ్యా తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.

బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు.

"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది. మాలవ్యా భారతరత్న కు డిసెంబరు 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు. ఈయన 1946 వ సంవత్సరం లో పరమపదించారు.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madan mohan malavya  bharat rathna  freedom fighter  

Other Articles