Bheemreddy satyanarayana reddy biography

bheemreddy satyanarayana reddy news, bheemreddy satyanarayana reddy story, bheemreddy satyanarayana reddy history, bheemreddy satyanarayana reddy photos, bheemreddy satyanarayana reddy wiki, bheemreddy satyanarayana reddy biography, bheemreddy satyanarayana reddy

bheemreddy satyanarayana reddy biography who dedicated his all life for poor people without married

పెళ్లి చేసుకోకుండా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన యోధుడు!

Posted: 10/08/2014 05:52 PM IST
Bheemreddy satyanarayana reddy biography

బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశంలో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు వారి దౌర్జన్యాలను అరికట్టేందుకు ముందుకు వచ్చారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలను చేపడుతూ.. ప్రజల్లో చైతన్యం నింపిన మహానుభావులు ఎందరో వున్నారు. అటువంటివారిలో భీంరెడ్డి సత్యానారాయణరెడ్డి కూడా ఒకరు! ఈయన కేవలం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగానే కాదు.. నిజాం విమోచనోద్యమకారుడు కూడా! ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన.. తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ఒక ప్రత్యేక గుర్తింపును ఈయన క్రియేట్ చేసుకున్నారు.

జీవిత చరిత్ర :

1927 ఆగస్టు 21న మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మండలం అన్నారంలో భీంరెడ్డి నర్సిరెడ్డి, మాణిక్యమ్మ అనే దంపతులకు బి.సత్యనారాయణరెడ్డి జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. మొగిలిగిద్దలోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న సత్యనారాయణ.. ఆ తర్వాత హైదరాబాదులోని వివేకవర్ధిని హైస్కూల్‌, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశలోనే సామ్యవాద భావాలు కలిగిన నేపథ్యంలో ఆయన 14 ఏళ్ల వయసులోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. అలా ఆ విధంగా ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన.. ఇక వెనుదిరిగి చూడలేదు. దేశస్వాతంత్ర్య పోరాటాల్లో కీలకపాత్రను పోషించారు. ఆ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు.

తొలుత సత్యనారాయణరెడ్డి... ఆచార్య నరేంద్రదేవ్‌, 'లోక్‌నాయక్‌' జయప్రకాశ్‌ నారాయణ్‌, రామ్‌మనోహర్‌ లోహియాల స్ఫూర్తితో సోషలిస్టు పార్టీలో క్రియాశీలంగా పాల్గొన్న ఈయన.. వినోబా భావే భూదాన ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో 'మీసా' చట్టం కింద 18 నెలలు జైల్లో ఉన్నారు. అక్కడ కూడా ఈయన అనవసరంగా కాలక్షేపం చేయలేదు. జైల్లో 'పయామ్‌-ఇ-నవ్‌' అనే ఒక హిందీ పత్రికను నడిపి, సహచరులకు పంచిపెట్టేవారు. జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత జనతా పార్టీలో చేరారు. అనంతరం 1978లో ఆపార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. అయితే అప్పట్లో ఆ పార్టీలో పాలనపరంగా నిర్ణయాలు సరిగ్గా తీసుకోవడం లేదనే కారణంతో ఆయన 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి, 1994లో రెండవసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

1990-93 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా, 1993 నుంచి 1995 వరకు ఒడిషా గవర్నర్‌గా పనిచేశారు. 1993లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి ఇన్‌ఛార్జి గవర్నర్‌గా కొద్దికాలం వ్యవహరించారు. తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేయాలనే భావనతో ఆయన చివరకు పెళ్లి కూడా చేసుకోలేదు. ఆర్యసమాజ్ ఆదర్శాలను అమలులో పెట్టారు. తనకు సంక్రమించిన 25 ఎకరాల భూమిని అన్న కుమారుడైన రాంచంద్రారెడ్డికి ఇచ్చి, తన శేషజీవితాన్ని రాంచంద్రారెడ్డి వద్దే గడిపారు. స్వగ్రామంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించి... దళితులకు పక్కా ఇళ్లు మంజూరు చేయించారు. ఇలా ఈ విధంగా ఈయన పేదప్రజలకోసం ఎన్నో సేవలు అందించారు. అయితే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఈయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6.10.2012న తుది శ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles