Mega producer allu aravind turns 64

Allu Aravind, Star Producer, Cinema power, king maker, Allu team, Geeta Arts Banner, Mega Producer turns 64

Mega Producer turns 64, Allu Aravind, dominant force behind the screen, Allu Aravind born on 10th January 1949 is a well known personality today not only in the State of Andhra Pradesh but also in the India Cinema arena.

Mega Producer turns 64_Allu Aravind.gif

Posted: 01/10/2012 05:31 PM IST
Mega producer allu aravind turns 64

Mega_Producer_Aravind

Allu-Aravind

ఈరోజు అల్లు అరవింద్ పుట్టిన రోజు.  ఎక్కువగా పరిచయం అవసరం లేని అరుదైన వ్యక్తులలో ఒకరు అల్లు అరవింద్.  జనవరి 10న జన్మించిన అల్లు అరవింద్ ఈ రోజు అరవైమూడు వసంతాలు దాటి అరవై నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్నారు.  సినిమారంగంలో సుదీర్ఘకాలం హాస్యనటుడిగా జీవించి తెలుగుతెరకు సుపరిచితులైన అల్లు రామలింగయ్య కుమారుడైన అల్లు అరవింద్, తెరమీద కనిపించి ఆడేదానికంటే తెర వెనుక ఉండి ఆడించటంలోనే ఎక్కువ మక్కువ చూపించారు.   సినిమా పరదా మీద కనిపించే వారిని అలా కనిపించేటట్టుగా కృషిచేసిన వారు ఎక్కడో వెనకే ఉండిపోతారు.  అలాంటివారు గుర్తింపులు, పురస్కారాలు, మెచ్చుకోళ్ళకి ఆశపడరు.  అల్లు అరవింద్ కూడా అంతే.  తనపనేమిటో తన వ్యాపారమేమిటో తానే కానీ పబ్లిక్ ఫిగర్ గా కనిపించటానికి ఎప్పుడూ చూడలేదు.  కానీ గుర్తించటంలో ఆలస్యం జరిగినా, నిజమైన సేవచేసినవారికి గుర్తింపనేది దానంతటదే వస్తుందని అల్లు అరవింద్ విషయంలో ఋజువైంది.  సినీ నిర్మాతగా, పంపిణీ దారునిగా సినిమారంగంలో అలుపెరుగని సేవ చేసినవారే అల్లు అరవింద్. 
          ఇదేమిటి, ఆయన వ్యాపారం చేసుకుంటుంటే సేవ అని అంటారేమిటని అనుకుంటున్నారా.  అనుకోరు.  ఎందుకంటే వ్యాపార వాణిజ్యాలే లేకపోతే సమాజం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందేది కాదని అందరికీ తెలుసు.  ఆయన వేరే ఏదైనా వ్యాపారం కూడా చేసుకునుండవచ్చు కదా.  సినిమాలో నటించటం సులభం కాదు, దానికి ఎంతో కృషి చెయ్యాలన్నది చాలా మందికి తెలుసు కానీ, ఆ సినిమా నిర్మించటానికి ఎందరి కృషి ఉంటుంది, అందులో దానికి జీవం పోసే నిర్మాత మీద ఎంత భారం పడుతుంది అన్నది చాలా కొద్దిమందికే తెలుసు.  ఎంతో ఖర్చు పెట్టి తీస్తే దాన్ని తప్పక ఆదరిస్తామని ప్రేక్షకులేమైనా వాగ్దానాలు చేస్తారా.  సినిమా తీసేది వారి కోసమే కానీ వారికి నచ్చేట్టుగా రూపొందించాలి.  వారికేం నచ్చుతుందనే సూత్రం ఇంతవరకూ ఎవరికీ అంతుబట్టలేదు.  అటువంటి సందిగ్ధకరమైన క్షేత్రంలో గుండె ధైర్యంతో పెట్టుబడి పెట్టటమే కాకుండా తన అనుభవంలో ఆ సినిమాను ఎలా పండించాలి అన్నది కూడా ఆయనకు తెలుసు. 
          ఇంతవరకూ ఏ దర్శకుడూ అల్లు అరవింద్ విషయంలో పెట్టుబడుల విషయంలో కానీ స్వేచ్ఛగా పనిచెయ్యనివ్వటంలోకానీ, సమయానికి డబ్బు అందించటంలో కానీ, చిన్న చిన్న సమస్యలొస్తే వాటిని పరిష్కరించి నిర్మాణాన్ని ముందుకు సాగనివ్వటానికి తోడ్పడటం లో కానీ ఏ దర్శకుడి నుంచీ ఫిర్యాదులు రాలేదు. 
గీతా ఆర్ట్స్ పేరుతో అల్లు అరవింద్ ప్రారంభించిన నిర్మాణ సంస్థ ఈరోజు పెద్ద బడ్జెట్ల నిర్మాణ సంస్థగానే అందరికీ తెలుసు కానీ ఆ సంస్థAllu-Ramalingaiah 1974 లో బంట్రోతు భార్య సినిమాతో మొదలుపెట్టి 2011 లో బద్రీనాథ్ వరకూ వరసగా 33 సినిమాలను నిర్మించింది.  వాటిల్లో చిరంజీవి, రజనీకాంత్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ లాంటి దక్షిణాది అగ్రనాయకులే కాకుండా, అమీర్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి హిందీ అగ్ర నాయకులతో కూడా సినిమా నిర్మాణం కావించారు.  సినీ నిర్మాణంలోనే ఉండిపోకుండా, అల్లు అరవింద్, పంపిణీ, సాంకేతికంగా ఎదుగుతూ డిజిటలైజేషన్ రంగంలోనూ కాలు పెట్టారు.  సినిమా రూపొందించటంలో ఎంత కష్టపడతారో దాన్ని లాంచ్ చెయ్యటంలోనూ అంతే కష్టపడి చెయ్యకపోతే ప్రేక్షకులలోకి పోదది.  అందువలన సినిమా ప్రచారం కూడా అవసరమేనని గ్రహించి అందులో కొత్త కొత్త కోణాలను వెదుక్కుంటూ సినిమాలకు టిషర్ట్ లు, కీచైన్ లు, బద్రీనాథ్ యాత్రల్లాంటి కొత్తపుంతలు తొక్కిన ప్రచార సామగ్రిని వాడారు. 
అల్లు అరవింద్ ఇంతవరకూ సినిమా జయాపజయాల విషయంలో ఎవరి మీదా ఆరోపణ చేసిన దాఖలాలు లేవు.  ఇది నా యుద్ధం, నేను చేస్తాను, దానికి కావలసిన ఆయుధ సంవత్తిని నేను సమీకరించుకుంటాను, శక్తియుక్తులను నేను సమకూర్చుకుంటాను అన్న ధోరణే అల్లు అరవింద్ చేపట్టే అన్ని వెంచర్లలోనూ కనిపిస్తుంది.  ఒక్క పుణెలో జరిగిన బద్రీనాథ్ సినిమా పైరసీ విషయంలోనే సీరియస్ గా తీసుకున్నారు.  అది దోపిడీ కనుక.  మరోసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విషయంలో లేని పోని ఆరోపణలు, చర్చలకు చెక్ పెట్టటానికి తీవ్ర స్థాయిలో ఖండించారు కానీ మరెక్కడా ఆయన విమర్శలకు పోలేదు. 
సినిమా నిర్మాణం చెయ్యటం, తద్వారా అలసిన మనసులు సేదతీరేటట్టుగా వినోదాన్ని పంచివ్వటంలోనే అలుపెరగకుండా పనిచెయ్యటానికి నిర్ణయించుకున్న అల్లు అరవింద్ చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించి ఆహ్వానించగా ఆయన మాటకు కాదనలేక పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలను కూడా స్వీకరించారు. 
Aravindభార్య నిర్మల, ముగ్గురు కొడుకులు వెంకటేష్, అర్జున్, శిరీష్ లతో తనవారితో ప్రేమను పంచుకుంటూ ఆదర్శవంతమైన గృహస్థాశ్రమాన్ని గుడుపుతూ వ్యాపార దక్షతతో చిన్న వటుడు ఎదుగుతూ దిగంతాలకు వ్యాపించినట్టుగా అల్లు అరవింద్ ఆర్భాటాలకు పోకుండానే సహజరీతిలో తెలుగువారికి చేరువై, చివరకు వారి హృదయాల్లో పటిష్టమైన చోటుచేసుకున్నారు.  మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు వచ్చినా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని చూసినా, పవర్ స్టార్ పవన్ ని కానీ రామ్ చరణ్ కానీ కనిపించినా, మగధీర సినిమాలు, అందులో పాటలు వినిపించినా సరే, అల్లు అరవింద్ వెంటనే మదిలో మెదులుతారు.  
అల్లు అరవింద్ ఇలాగే నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆరిపోని కళాతృష్ణ, తపనలతో మరెన్నో వినోదభరితమైన చిత్రాలను నిర్మిస్తూ, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను సొంతం చేసుకుంటూ రాబోయే తరాలకు కూడా అనువైన చిత్రాలను అందిస్తారని ఆశిస్తూ,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Freedom fighter rani lakshmi bai
Malleswari movie 60 years celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles