Modi has not fulfilled promises in 100 days

Anand Sharma, Narendra Modi, Election Promises, BJP, 100 days

modi has not fulfilled promises in 100 days says anand sharma

అరచేతిలో వైకుంఠమా.. క్షమాపణ చెప్పాలి..

Posted: 10/05/2014 07:21 PM IST
Modi has not fulfilled promises in 100 days

ప్రధాని నరేంద్రమోడీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ. ఎన్నికలకు ముందు దేశాన్ని మార్చేద్దామని ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ.. 100 రోజుల్లో ఏం సాధించారని ప్రశ్నించారు. ఎన్నికల వాగ్ధానాలను నిలుపుకోలేని ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. వంద రోజుల పాలన పూర్తిచేసుకున్న మోదీ.. ప్రజలకు ఒరగబెట్టింది ఏమిటని ఆయన ప్రశ్నించారు..

అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. మంచి రోజులు వస్తాయని ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. మోదీకి, ఆయన ప్రభుత్వానికి మాత్రమే మంచి రోజులు వచ్చాయని చెప్పారు. ప్రజల స్థితిగతులు ఏమీ మారలేదని దెప్పిపొడిచారు. కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటాయని ఆరోపించారు. 100 రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తీసుకువస్తామన్న మోడీ.. ఏం చేశారని ఆనంద్ శర్మ నిలదీశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anand Sharma  Narendra Modi  Election Promises  BJP  100 days  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more