Nagma comments hindu muslim religions on bjp

actress nagma, congress leader nagma, nagma comments bjp, nagma fires bjp, nagma met with gangraped girl

actress nagma controversial comments hindu muslim religions on bjp party : actress and congress party leaders make controversial comments on bjp party that bjp is spreading the differences between hindu muslim religions which will creates war.

‘‘రేప్’’ వ్యవహారంలో మతం చిచ్చు రేపిన నటి నగ్మా!

Posted: 08/07/2014 03:01 PM IST
Nagma comments hindu muslim religions on bjp

మీరట్ జిల్లాలోని ఖర్ఖౌదా ప్రాంతంలో 20ఏళ్ల మహిళను కొందరు బలవంతంగా ఎత్తుకెళ్లి ఆమెను రేప్ చేసి, గర్భం రాకుండా వుండేందుకు ఫెలోపియన్ ట్యూబ్ ని తొలగించి, ఆపై మతమార్పిడికోసం పాల్పడిన ఘటన పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఓ మదర్సాకు చెందిన మహ్మద్ నవాబ్, సలాఉల్లా అనే నిందితులు ఈమెను బలవంతంగా తీసుకెళ్లారని.. అక్కడ ఆమెను అనేక చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా రేప్ కూడా చేశారని వాపోయిన బాధితురాలు... ఆ మదర్సాలో తనవంటి అమ్మాయిలు ఇంకా చాలామంది వున్నారని, ఎంతో కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని తెలిపింది. ప్రస్తుతం ఈ బాధిత యువతి ఘజియాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసులో ఆ ఇద్దరి నిందితులతోపాటు సమర్ జహాన్ అనే మహిళను, ఆమె కుమార్తె నిషాత్ ను కూడా అరెస్ట్ చేశారు.

ఇదిలావుండగా.. చికిత్స పొందుతున్న బాధిత యువతిని నటి, కాంగ్రెస్ నేత నగ్మా ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఈ వ్యవహారంపై మాట్లాడిన ఆమె... బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో కాషాయదళం అయిన బీజేపీ పార్టీ మతం రంగు పులమడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేసింది. రెండు మతాల మధ్య చిచ్చు రేపడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని... అటువంటి మతతత్వ పార్టీలను దేశ రాజ్యాంగం నుంచే బహిష్కరించాలని ఆమె వ్యాఖ్యానించారు. ఈ రేప్ ఉదంతంపై అనవసరంగా బీజేపీ పార్టీ మతతత్వ చిచ్చు రేపుతోందని.. అధికార పార్టీ అయి కూడా ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడాన్ని చూస్తే ఎంతో అవమానకరంగా వుందని ఆమె వెల్లడించారు. ‘‘నేరం చేసేవాళ్లకు కుల, మతం, ప్రాంతీయ వంటి బేధాలుండవు. నేరంచేసేవారిని నేరగాళ్లుగానే పరిగణించాలి. అంతేగానీ.. రెండు మతాల మధ్య చిచ్చురేగేలా నిర్ణయాలు తీసుకోకూడదని’’ ఆమె సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress congress leader nagma  gangrapes in india  meerut gangrape incident  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more