చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక ఘోరం వెలుగు చూసింది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా, రాజకీయ నాయకులు, స్మగ్లర్లకు పుట్టినిల్లు. ఇక నుండి చిత్తూరు జిల్లాలో చిన్న పిల్లలకు రక్ష లేకుండా పోయింది. నిత్యం కళ్ల ముందు తిరిగే మనుషులే చిన్న పిల్లలను నిర్బందింస్తున్నారు. అప్పు అనే పేరుతో.. చిన్న పిల్లలను .. నిర్భందించిన సంఘటన మదనపల్లెల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబ యాజమని (తండ్రి) అప్పు చేస్తే చిన్న పిల్లలకు శిక్షపడుతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలం నీరుగట్టుకు పల్లెకు చెందిన చేనేత కార్మికుడు రాజు అతని భార్య , హేమావతి, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. రాజు తన దగ్గర బంధువు అయిన ఉదయ్ కుమార్ ఇంట్లోనే ఉంటూ మగ్గం పని నేర్చుకుంటున్నారు. అయితే రాజు కుటుంబ ఖర్చులు, వ్యాపారం నిమిత్తం, అనంతపురం జిల్లాకు చెందిన రామక్రిష్ణ వద్ద రెండు లక్షలు అప్పు చేయటం జరిగింది.
అయితే రాజు ప్రతి రోజు కష్టపడి తీసుకున్న అప్పును వాయిదా పద్దతిలో.. లక్ష 40 వేల రూపాయలు తీర్చటం జరిగింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల 60 వేల రూపాయలు చెల్లించలేకబకాయి పడ్డాడు. దీంతో అప్పు ఇచ్చిన రామక్రిష్ణ ఈనెల 16 న మదనపల్లెకు వచ్చి వెంటనే నా బాకీ తీర్చాలని రాజుపై ఒత్తిడిపెట్టాడు. దీంతో రామక్రిష్ణ ఒత్తిడి తట్టుకోలేక.. పట్టణంలో ఉన్న మిత్రుని వద్దకు వెళ్లి డబ్బులు తీసుకొస్తానని చెప్పి , ఇంటి నుండి బయటకు బయులుదేరాడు.
అయితే సాయంత్రం అయిన రాజు ఇంటికి రాకపోవటంతో.. రామక్రిష్ణ, రాజు కొడుకులను సాయికిరణ్, ఉదయ్ కుమార్ ను తీసుకొని అనంతపురం వెళ్లిపోవటం జరిగింది. అంతేకాకుండా.. డబ్బులు పూర్తిగా కట్టిన తరువాతనే పిల్లలను విడిపించుకోవాలని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో రాజు భార్య ఖంగారుపడి, వెంటనే పోలీసులను ఆశ్రయించి, జరిగిన విషయం చెప్పటంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, రామక్రిష్ణ నుండి పిల్లలను విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more