Raghuveera Reddy to Rajya Sabha from YSRCP.? రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

Raghuveera Reddy, Rajya Sabha Ticket, Former APCC Chief, YSRCP, Yadava community, YS Rajashekar Reddy close aid, staunch supporter, Chiranjeevi, Beeda Masthan Rao, TDP, Andhra Pradesh, politics

Former APCC chief Raghuveera Reddy is likely to join the YSRCP soon. Raghuveera is known as a staunch supporter of former Chief Minister YS Rajasekhara Reddy. After bifurcation of united Andhra Pradesh, he served as APCC chief for Andhra Pradesh.

రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

Posted: 02/26/2020 08:37 PM IST
Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు సముచితమైన వ్యక్తులను ఎంపిక చేయడంలో గత నెల రోజులుగా తలమునకలైన పార్టీ.. ముందుకు ఈ పదవులకు బహుముఖ ప్రయోజనం కలిగే వ్యక్తులను ఎంపిక చేయాలని భావించింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండానే ఈ ప్రయోజనాన్ని కలిగించే వ్యక్తులను పంపితే తమ పార్టీకి మరింత మైలేజ్ కలిసోస్తుందని భావించింది.

ఈ తరుణంలో సినీహీరో మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ పదవులను ఇవ్వనున్నట్లు కూడా సంకేతాలను పంపింది. ఈ మేరకు ఆయనపై తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చింది. అయితే చిరంజీవి వైసీపీ ప్రభుత్వం ఆఫర్ ను అంతే సున్నితంగా తిరస్కరించారని సమాచారం. తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి.. ముందుకువెళ్తున్న క్రమంలో తాను రాజకీయాలకు దూరంగా.. సినిమాలోకానికి, అభిమానులకు దగ్గరగా వుంటానని చెబూతూనే వైసీపీ ప్రతిపాదనను తిరస్కరించారని తెలిసింది. బంధువర్గ, సన్నిహిత వర్గ, వాణిజ్య, సామాజికపరంగా పలువురు నుంచి ఒత్తడి వచ్చినా చిరంజీవి తనతో రాజకీయాలు ఇక కుదరవని తేల్చిచెప్పారని సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే రాజ్యసభ స్థానాలకు సంబంధించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డిని వైసీపీ తరపున రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన తండ్రికి అత్యంత ఆప్తుడిలా, అనుంగు అనుచరుడిలా వున్న ఎన్, రఘువీరా రెడ్డికి ఈ సముచిత స్థానం కల్పించాలని జగన్ భావిస్తున్నారన్న వార్తలు సంచలనంగా మారాయి. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన రాఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేతగా ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో పార్టీకి ఆదరణ లభించకపోయినా.. ఆయన మాత్రం ఇంకా కాంగ్రెస్ లోనే కోనసాగుతున్నారు.

ఇటీవలే ఆయన కాంగ్రెస్ పిసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి కొంత బ్రేక్ తీసుకుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ పిసిసీ చీఫ్ గా శైలజానాథ్ ను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. తులసిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించింది. అయితే కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న తన తండ్రి వైఎస్ ముఖ్యఅనుచరులుగా ముద్రవేసుకున్న నేతల్లో రఘువీరా ఒక్కరు. ఈయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మధ్య మంచి అనుభందం ఉంది. దీన్ని నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ పదవిని అందించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి తోడు మరో ప్రయోజనం కూడా ఈ తరుణంలో తమ పార్టీకి కలుగుతుందని కూడా జగన్ సమ్మతించారని తెలుస్తోంది.

అదేంటంటే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వున్న సన్నిహిత సంబంధాలకు తోడు రఘువీరా రెడ్డి సామాజికవర్గంతో పాటు బీసి వర్గాలు కూడా ఈ క్రమంలో తమకు అనుకూలంగా వుంటాయని ఆయన భావిస్తున్నారని సమాచారం. తన తండ్రికి నమ్మకైన వ్యక్తి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా వెళ్లి వ్యవసాయం చూసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన సీఎం వైఎస్ జగన్.. సముచిత స్థానం అందించి గౌరవించాలని భావిస్తున్నారు. ఈ రెండు కారణాలతో రాఘువీరా రెడ్డిని రాజ్యసభకు పంపాలని జగన్ యోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం దాగుందన్న విషయం తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh