RBI vs Govt: urjit to resign on Nov 19th..? 19న అర్బీఐ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా.?

Rbi governor urjit patel s possible resignation on november 19 th

demonetization, Narendra Modi, BJP, Congress, Rahul Gandhi, Finance minister vs RBI, Union finance minister, Urjit patel resignation, Arun Jaitley, resign, NPA, Urjit Patel, RBI Governor, Vital Acharya, RBI deputy governor, BJP Rajya sabha member, subramanian swamy, national news, Politics

After Rift between the Union Finance ministry and the RBI emerges bigger, some reports have suggested that the Governor Urjit Patel, may resign on 19th.

ఈసారి ఫిక్స్.. సాగనంపక ముందే సర్ధేసుకుంటున్నాడా.?

Posted: 11/08/2018 04:47 PM IST
Rbi governor urjit patel s possible resignation on november 19 th

తమ అదుపాజ్ఞలలోనే భారతీయ రిజర్వు బ్యాంకు కూడా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందా.? రిజర్వు బ్యాంకుపై అధిపత్యం కోసం ఇప్పటికే పలు సవరణలను తీసుకువచ్చిన కేంద్రం.. తాజాగా మరిన్ని సవరణలు చేయనుందా.? అంటే ఔననే సమాధానాలే వినబడుతున్నాయి. ధీనికి తోడు అటు కేంద్ర అర్థికశాఖకు అర్బీఐకి మధ్య కూడా విభేధాలు రచ్చకెక్కడంతో.. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను విషయంలో కేంద్ర మార్గదర్శకాలకు, దేశ సర్దోన్నతన న్యాయస్థానం అదేశాలకు మధ్య నలిగిపోయిన అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. మరోసారి తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారని సమాచారం.

కోటి రూపాయల నుంచి ఆ పైన బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన వారి జాబితాను బయటపెట్టాలని దేశఅత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో అదేశాలను జారీ చేసింది. అయితే ఆ అదేశాలను ఎందుకు పాటించలేదని సమాచార శాఖ కమీషన్ తాజాగా నోటీసులను కూడా జారీ చేసింది. ఈ క్రమంలో బ్యాంకు రుణగ్రస్థల జాబితాను అర్బీఐ బహిర్గతం చేసింది. దీంతో వారి వివరాలను ఎందుకు బయటకు వెల్లడించారని కేంద్ర అర్థికశాఖ అర్బీైకి నోటీసులను పంపింది.

ఇలా అటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాలు.. ఇటు కేంద్ర సమాచార కమీషన్ నోటీసులు జారీ చేసిన క్రమంలో వాటికి అనుగూణంగా నడుచుకుంటే ఇటు కేంద్ర అర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నోటీసులు జారీ కావడంతో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఉర్జిత్ పటేల్.. తాను సుప్రీం కోర్టు అదేశానుసారం డీపాల్టర్ల జాబితాను బయటపెట్టానని కేంద్రానికి తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తన అరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన తన స్నేహితుల వద్ద వాపోతున్నారు.

ఇప్పటికే గత నెలలో రాజీనామా చేయాలని ఆయన బావించిన క్రమంలో ఆయనతో కేంద్ర అర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్ ద్వారా సంబాషించిన క్రమంలో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని మానుకున్నారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో తాను టార్గెట్ గా మారిపోతున్నానన్న అవేదన అతనిలో ఉత్పన్నమవుతుందని ఉర్జిత్ స్నేహితుల వద్ద వాపోయారని తెలుస్తుంది. దీంతో తన అరోగ్యంపైన కూడా ఈ పరిణామాల ప్రభావం పడుతుందని అందుకనే ఇక తాను ఈ పదవిలో కొనసాగకూడదని కూడా నిర్ణయించుకున్నారని సమాచారం.

తనను కేంద్రం సాగనంపే కన్నా ముందుగానే తానే రాజీనామా చేసిన సర్థుకుని వెళ్లడం ఉత్తమం అని ఉర్జిత్ భావిస్తున్నారని.. దీంతో కనీసం తనఅరోగ్యం కుదుటపడే అవకాశాలు కూడా వుంటాయని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సారి తాను ఎవరి మాటను వినదల్చుకోలేదని, తన రాజీనామా చేయడం ఖాయమని కూడా ఆయన తన స్నేహితులతో తేల్చిచెబుతున్నారట. ఈ క్రమంలో అర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఈ పదవిలో రాహుల్ ద్రావిడ్ మాదిరిగా నెగ్గుకురావాలని సూచనలు చేయడం కూడా ఉర్జిత్ కు మింగుడుపటం లేదని తెలుస్తుంది.

ఇక గతంలో అర్బీఐకి ప్రత్యేకమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని కేంద్రం యోచిస్తున్న క్రమంలో దానిని విభేదిస్తున్న రిజర్వు బ్యాంకు గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాలని యోచించారు. ఇప్పటికే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యను పదవి నుంచి సాగనంపాలని కేంద్రం యోచించిన క్రమంలో.. అర్బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయాలని కేంద్రం యోచిస్తోందని భావించిన ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయాలని భావించారు. కేంద్ర అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న మార్గదర్శకాలు దుష్పరిణామాలకు దారి తీస్తుందని ఆయన వీటిని వ్యతిరేకించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : finance minister  Arun Jaitley  PM Modi  Urjit Patel  NPA  RBI Governor  national news  

Other Articles