jerusalem mathaiah alleges life threat from AP chief minister chandrababu

Life threat to key accused in cash for vote case

cash for vote, note for vote, Andrapradesh, telangana, revanth reddy, jerusalem mathaiah, sandra, Telugu states Chief Ministers, KCR, telangana ACB, phone tapping case, parvathipuram police station, vijayawada, horse riding mathaiah sensation comments, mathaiah life in danger, nataian life threat

forth accused in Cash for vote which rocked both telangana and andhra pradesh states, Jerusalem Matthaiah in danger from the Telugu states Chief Ministers.

ప్రాణహానిపై మాటమార్చిన మత్తయ్య.. ఎందుకు..?

Posted: 08/24/2016 10:34 AM IST
Life threat to key accused in cash for vote case

రెండు తెలుగు రాష్ట్రాలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పునాదులని కదిలించేసిన ఓటుకి నోటు కేసులో 4వ నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య హఠాత్తుగా చాలా విషయాలు మాట్లాడేశాడు. ఈ కేసుతో తనకి ఎటువంటి సంబంధం లేదని కానీ కెసిఆర్ తనని అన్యాయంగా ఇరికించారని మత్తయ్య చెప్పాడు. ఈ కేసు బయటపడినప్పుడు, ఏపి సిఎం చంద్రబాబు చాలా భరోసా ఇచ్చారని కానీ ఇప్పుడు ఆయన కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుకొన్న రాజకీయ చదరంగంలో తనని బలిపశువుని చేశారని అవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు, చంద్రశేఖర్ రావుల రాజకీయ క్రీనీడ కారణంగా ప్రస్తుతం తనకు ప్రాణహాని ఏర్పడిందని అందుకే ఢిల్లీ లోనే ఉండిపోయానని మత్తయ్య చెప్పాడు. జాతీయ మానవహక్కుల సంఘంలో కూడా ఫిర్యాదు చేస్తూ ఒక పిటిషన్ వేశానని చెప్పాడు. త్వరలో సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ వేసినప్పుడు తన న్యాయవాదికి ఓటుకి నోటు కేసులో చంద్రబాబు తదితరుల పాత్ర గురించి వివరిస్తారని చెప్పాడు. ఇలా తాను మీడియాతో పలు విషయాలను పంచుకున్న 24 గంటలలోనే మళ్లీ మాట మార్చాడు. నేరం మొత్తాన్ని తెలంగాణపైకి నెట్టి.. చంద్రబాబు పాట పాడాడు.

అదెలా అంటే.. ఓటుకి నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకి వెళ్ళినప్పటికీ, చంద్రబాబు మాత్రం పెద్ద మనసుతో ఫోన్ ట్యాపింగ్ కేసుని విడిచిపెట్టేశారని చెప్పాడు. “అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా మంది కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలని కొనుక్కుంది కదా...మరి అటువంటప్పుడు ఈ ఓటుకి నోటు కేసు మాత్రం ఎందుకు?” అని ప్రశ్నించాడు. ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీపడి కేసులని ఉపసంహరించుకొని దాని నుంచి తనకి విముక్తి కల్పించాలని కోరాడు.

హఠాత్తుగా మత్తయ్య చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటం గమనిస్తే ఆయన మాటల వెనుక నిజంతో పాటు తనను పట్టించుకోవడం లేదన్న భాధ కూడా వుందని స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై తను కౌంటర్ వేసినప్పుడు, ఓటుకి నోటు కేసులో తెర వెనుక పెద్దమనుషుల గురించి, ఆ కేసులో జరిగిన యధార్థం గురించి తన న్యాయవాది చెపుతారని తెర వెనుకనుండి కథ నడిపిస్తున్న పెద్దలకు మత్తయ్య హెచ్చరికలు జారీ చేశారనడంలో సందేహమే లేదు. అయితే ఎలాంటి తప్పు చేయని వారిని మత్తయ్య మాత్రం ఎలా బెదిరిస్తారన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

కేసు నమోదైన నేపథ్యంలో అయనను జోలపాడిన పెద్దమనుషులు ఇప్పుడాయనను విస్మరించడంతో అదే భాధతో మత్తయ్య ఇలాంటి హెచ్చరికలు జారీ చేసివుంటారన్ని కూడా అనుమానాలు కలుగుతున్నాయి. మత్తయ్య హెచ్చరికల నేపథ్యంలో తెర వెనుక ఉన్న ఆ పెద్ద మనుషులు ఒత్తిడి చేయడంతో మళ్లీ ఆయన మాట మార్చాడేమో? ఏమైనప్పటికీ ఈ కేసులో చాలా పెద్ద తలకాయలున్నాయన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఈ కేసు వారి రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది కనుక మత్తయ్యకి ప్రాణహాని ఉండే అవకాశం ఉందనే సందేహాలకు రేకెత్తుతున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jerusalem mathaiah  cash for vote  threat  danger  sensation comments  chandrababu naidu  KCR  ACB  

Other Articles