వైసీపీలో చేరనున్న కొట్టు సత్యనారాయణ | TDP leader Kottu Satyanarayana likely to join YSRCP

Tdp leader kottu satyanarayana likely to join ysrcp

TDP Senior leader Kottu Satyanarayana, Kottu Satyanarayana YSRCP, TDP to YSRCP, TDP's Kottu Satyanarayana, TDP's Kottu Satyanarayana, Tadepalligudem ex MLA to YSRCP

TDP Senior leader Kottu Satyanarayana likely to join YSRCP

టీడీపీ నుంచి వైసీపీకి!! ఎవరాయన?

Posted: 08/17/2016 06:11 PM IST
Tdp leader kottu satyanarayana likely to join ysrcp

అసెంబ్లీ సమావేశాలు, పుష్కరాలు, అన్నింటికి మించి ప్రత్యేక హోదాపై రేగిన అలజడి ఈ వరుస హడావుడిల నేపథ్యంలో ఏపీలో ఫిరాయింపులు కాస్త తగ్గుముఖమే పట్టాయి. అంతకు ముందు మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తునే ఫిరాయింపులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అధికార పక్షాల్లోకి చేరటం ద్వారా లబ్ధి పొందటంతోపాటు, రాజకీయ భవిష్యత్తును సేఫ్ జోన్ లో ఉంచుకోవాలన్నదే వారి ఉద్దేశం. విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సైకిల్ కోసం క్యూ కట్టగా, ఇప్పుడు మాత్రం పరిస్థితి కాస్త చల్లబడింది.

అయితే తాజాగా టీడీపీకి ఓ రివర్స్ పంచ్ పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వలస కొనసాగేలా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఈ తరహా బాట పట్టడానికి బలమైన కారణం ఉందట.

2014లోనే టీడీపీలో చేరిన ఆయన గడచిన ఎన్నికల్లో తాడేపల్లిగూడెం టికెట్టు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి దక్కింది. దీంతో కొట్టుకి ఆశాభంగం అయ్యి బహిరంగంగానే పార్టీపై అసంతృప్తి వెల్లగక్కారు. ఆపై స్వయంగా చంద్రబాబు నాయుడు కల్పించుకోవటంతో సైలెంట్ అయిన ఆయన ఈ మధ్య పార్టీ కలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి కూడా పరిస్థితిలో మార్పేమీ కనిపించకపోతుందని భావిస్తున్న ఆయన తక్షణమే పార్టీ మారాలని యోచిస్తున్నట్లు సమాచారం.

అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇస్తేనే ఆయన వైసీపీలో చేరతాననే కండిషన్ పెట్టారంట. దీంతో ఇప్పటి నుంచే టికెట్ ఆశిస్తున్న ఆశావహులను బుజ్జగించే పనిలో పడింది వైసీపీ. చర్చలు గనక సఫలీకృతమైతే ఇంకో వారంలో కొట్టు వైసీపీలో చేరటం తథ్యంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tadepalligudem  TDP  Senior leader  Kottu Satyanarayana  YSRCP  

Other Articles