Senior NTR Blessed TDP leader Revanth Reddy

Senior ntr blessed tdp leader revanth reddy

TDP, NTR, Senior NTR, Revanth Reddy, TeluguDesamParty, Chandrababu Naidu

TeluguDesamParty fire brand, TTDP working President describe his dream. He said that senior NTR blessed him and told to work for TDP.

రేవంత్ రెడ్డికి సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వాదం..!

Posted: 02/19/2016 04:33 PM IST
Senior ntr blessed tdp leader revanth reddy

తెలుగుదేశం ఫైర్ బ్రాండ్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓ పిట్ట కథ చెప్పారు. ఇప్పుడు ఆ కథ అదరికి చర్చనీయాంశమైంది. తనకు ఓ కల వచ్చిందని... ఆ కల గురించి చెప్పగానే అందరికి షాక్ అయ్యారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు అని అనుకుంటున్నారా..? సీనియర్ ఎన్టీఆర్  ఆయన కలలోకి వచ్చాడట...వచ్చి ఓ గొప్ప విషయాన్ని చెప్పారట. అయితే అంతకన్నా ముందు టీటీడీపీ ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ రెడ్డి, వివేక్‌లు పార్టీ మారిన రోజు రాత్రి త‌న‌కు నిద్రప‌ట్టలేద‌న్నారు. వివేక్‌, రాజేంద‌ర్ రెడ్డిలు పేద ప్రజ‌లప‌క్షాన త‌న‌తో క‌లిసి మ‌రో 25 ఏళ్లు పోరాటం చేస్తార‌ని ఆశించాన‌న్నారు. అసెంబ్లీలో త‌న‌కు కుడిఎడ‌మ‌గా ఉన్న వారిఇద్దరిని చూసి సంతోషించేవాడిన‌న్నారు. కానీ అలాంటి వారు పార్టీ వీడ‌డం బాదేసింద‌న్నారు.

ఇలా ఇద్దరు కీలక నాయకులు పార్టీని వీడటంతో రాతంత్రా నిద్రపట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి.  ఆ రోజు రాత్రి తెల్ల‌వారుజామున మ‌హానుభావుడు ఎన్టీఆర్ గుర్తుకొచ్చార‌ని చెప్పారు. ”పోయిన వారి కోసం బాధ‌ప‌డే కంటే ఉన్న కార్యక‌ర్తలను చూసి సంతోషించి ప‌నిచేయ్…” అని ఆయ‌న స్వర్గం నుంచి ఆదేశించిన‌ట్టుగా అనిపించిదన్నారు. ”కార్యక‌ర్తల కోసం పోరాడు… నీ వెంట నేను ఉంటా అని స్వర్గం నుంచి ఆశీర్వదించిన‌ట్టుగా” అనిపించింద‌న్నారు. పార్టీ ఎక్కడికి పోదు అని ఎన్టీఆర్ అన్నట్టుగా అనిపించింద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  NTR  Senior NTR  Revanth Reddy  TeluguDesamParty  Chandrababu Naidu  

Other Articles