Why pawan kalyan silent

telangana, telangana government, telangana latest, kcr, trs, telangana logo, latest news, andhrapradesh, pawan kalyan, pawan kalyan latest, pawan kalyan silence, pawan kalyan speech, pawan kalyan comments, ghmc, ghmc elections, tdp, bjp, telugu desam party, bharatiya janata party

pawan kalyan silent in recent days after the two states formed and new governments ruling : rumors that pawan kalyan doing ground work on the ghmc elections and he is working to maintain tdp, bjp strong in hyderabad

పవన్ సైలెన్స్ తుఫాను ముందు నిశబ్దమా..?

Posted: 09/22/2014 06:35 PM IST
Why pawan kalyan silent

ఎన్నికల సమయంలో తన ప్రచారంతో ప్రజల్లో చైతన్యం కల్గించిన పవన్ కళ్యాణ్ కొద్దికాలంగా నిశబ్దంగా ఉన్నాడు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ కూడా ప్రస్తుతం అంత చురుగ్గా ఏ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. దీంతో వపన్ కేవలం ఎన్నికల ప్రచారం కోసమే పార్టీ పెట్టాడని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం తుఫాను ముందు నిశ్శబ్దంలా పవర్ స్టార్ మౌనం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ, బీజేపి తరపున ప్రచారం నిర్వహించిన కళ్యాణ్, మరోసారి రెండు పార్టీలకు లాభం చేకూర్చేందుకు పనిచేస్తున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి.

తెలంగాణను ఏపీ నుంచి విడగొట్టేందుకు ఉద్యమం చేసిన టీఆర్ఎస్ అధినేత.., ఇప్పుడు హైదరాబాద్ ను కూడా ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. అంటే ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీని మూడు కార్పోరేషన్లుగా చేయాలని ప్లాన్ గీసుకుంటున్నాడట. అయితే ఏ ప్రాంతాన్ని ఎలా విభజిస్తారనేది కాస్త సీక్రెట్ గా ఉంచారు. భాగ్యనగరంలో గులాబి జెండా ఎగరాలని ఉవ్విళ్ళూరుతున్న కేసీఆర్.., ఇందుకోసం విభిజించి పాలించు అనే సిద్ధాంతాన్ని అచ్చు తప్పుపోకుండా పాటిస్తున్నాడు. అందుకే పార్టీకి బలం పెరిగేందుకు కార్పోరేషన్ ను విభజిస్తున్నారని తెలుస్తోంది.

అటు హైదరాబాద్ లో టీడీపీ, బీజేపి బలంగా ఉన్న పార్టీలు. జీహెచ్ ఎంసీలో రెండు పార్టీలకు మంచి స్థానబలం ఉంది. దీన్ని మరింత పెంచుకునేందుకు ప్రస్తుతం పవన్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడట. టీఆర్ఎస్ కార్పోరేషన్లను విడగొడుతున్న నేపథ్యంలో.., ఆయా ప్రాంతాల్లో రెండు పార్టీలను బలోపేతం చేసేలా కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు ఆపరేషన్ పవన్ ను సీక్రెట్ గా రెండు పార్టీలు నడుపుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే కొద్దికాలంగా ఆయన ఏ ప్రకటనా చేయటం లేదు.., ఇదంతా చూసి కధ ముగిసింది అనుకుంటే.., మీ కధ అడ్డం తిరుగుతుంది అని విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. పవన్ పవర్ తెలిసిన పార్టీగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu desam party  bjp  pawan kalyan  ghmc  

Other Articles