Indian tennis star sania mirza not interested in wearing telangana logo

indian tennis star sania mirza, sania mirza latest news, sania mirza hot photos, telangana brand ambassador, telangana state, sania mirza kcr photos, sania mirza with kcr, kcr press meet, sania mirza press meet, telangana state officials

indian tennis star sania mirza not interested in wearing telangana logo

తెలంగాణా అంటే సానియాకు ఇష్టం లేదా?

Posted: 09/13/2014 03:29 PM IST
Indian tennis star sania mirza not interested in wearing telangana logo

భారత ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... నిన్నమొన్నటివరకు ఈ అమ్మడి పేరు అంతగా వినిపించేది కాదు. కేవలం గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం... అందులో ఓడిపోవడం... తన పాకిస్తానీ భర్తతో కలిసి తిరగడం లాంటిని సమాచారాలు తప్పితే... ఈమెకు సంబంధించిన ప్రత్యేక వార్తాకథనాలు అయితే వచ్చేవి కావు. అయితే ఎప్పటినుంచైతే ఈ అమ్మడు తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడిందో... అప్పటినుంచి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అంతవరకు లేని స్థానికత గొడవలు.. ఒక్కసారిగా తెరమీదకు వచ్చేశాయి. ఇటు ఆంధ్రా రాజకీయాల నుంచి ఈమె మీద ఎన్నో విమర్శలు... నేషనల్ మీడియాలో అందుకు సంబంధించిన తెగ వార్తాకథనాలు! మొత్తంగా చెప్పాలంటే.. ఈమె తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకోబడిన క్షణం నుంచి కేవలం తెలంగాణా రాష్ట్రానికే కాదు.. ఇండియాకే పెద్ద బ్రాండ్ గా మారిపోయింది. ఈమెకు ఈ స్థానం దక్కడానికి కారణం కేవలం తెలంగాణాకే సాధ్యమని చెప్పడంలో ఔచిత్యమేమీ లేదు.

సానియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెకు కోటి రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే! అలాగే ఇటీవలే యూఎస్ ఓపెన్ డబుల్స్ సాధించడంతో మరోసారి ఆమెకు కోటిరూపాయల వరం కూడా లభించింది. ఇదిలావుండగా... ప్రస్తుత సానియామీర్జా వ్యవహారం శైలి చూస్తుంటే ఆమెకు తెలంగాణా అంటే అంతగా ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. సానియాకు కోట్లకు కోట్ల రూపాయలు తెలంగాణా అంటగడుతున్నప్పటికీ... ఆమెకు తెలంగాణా మీద మక్కువ లేనట్టుగా తెలుస్తోంది. అందుకు కొన్ని నిఖార్సైన కారణాలు కూడా మన కంటికి కనిపిస్తాయి. అదేమిటంటే.. తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న ఈ అమ్మడు.. తెలంగాణా లోగోను ఇంతవరకు ధరించలేదు. సాధారణంగా ఏదైనా ఒక ప్రొడక్ట్ గా అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న తారలు.. ఆ ప్రొడక్ట్ కు సంబంధించిన లోగోలతో ప్రచారం చేస్తారు. కానీ సానియా మీర్జా అలా చేయడం లేదు. దీంతో తెలంగాణా ప్రజలు ఆమె మీద ఆగ్రహంగా వున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ విషయంమీద రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

సానియా మీర్జా యూఎస్ ఓపెన్ లో ఆడుతున్న సమయంలో తెలంగాణా లోగోను ధరించివుంటే.. తెలంగాణా బ్రాండ్ విశ్వవ్యాప్తంగా విస్తరించి వుండేది కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు. తెలంగాణా సర్కారు ఔదార్యాన్ని కోట్ల రూపాయల్లో స్వీకరించిన ఈ క్రీడాకారిణి... లోగో ఎందుకు ధరించడం లేదంటూ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఈ నిబంధన తెలంగాణా సర్కార్ పెట్టలేదా..? లేకపోతే సౌత్ కేటగిరిలో వున్న తెలంగాణా అంటే ఇష్టం లేక సానియానే నిరాకరించిందా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా నియమితులైన తర్వాత దాని ప్రచారం చేయాల్సిన బాధ్యత వారికే వుంటుంది. ఇక్కడ తెలంగాణా విషయంలో సానియా మీర్జా అలా వ్యవహరించకుండా ముఖం చాటేయడం మీద అధికారులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ తెలుగు క్రీడాకారులున్నప్పటికీ.. ప్రత్యేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సానియా మీర్జాకు బ్రాండ్ కిరీటం తొడిగిస్తే... దానికి కనీసం కృతజ్ఞత భావాన్ని కూడా ఈ పాకిస్తానీ కోడలు చూపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై క్రీడా సంఘ బాధ్యుడు మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర క్రీడా పాలసీలు వస్తేనే ఇలాంటి పొరబాట్లను సవరించే వీలుంటుందని సూచించారు. యూఎస్ ఓపెన్ లో సానియా మీర్జా తెలంగాణా లోగో ధరించకుండా ఆడడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం నుంచి డబ్బులు దండుకుంటున్నప్పుడు.. సానియా ఎందుకు లోగో ధరించలేదని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించే తక్షణమే తగిన చర్యలు చేపట్టి సానియాకు లోగోను ప్రవేశపెడితే... అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ విస్తరిస్తుందనే అభిప్రాయాన్ని వెలువరిస్తున్నారు. మరి ఈ విషయంపై కేసీఆర్, సానియా మీర్జాలు ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  kcr  telangana brand ambassador  telangana brand logo  

Other Articles