Jai samaikyandhra party chief kiran comment on ys jagan

jai samaikyandhra party, kirankumar reddy, ys Sharmila, ys jagan, ysrcp, election 2014, jai samaikyandhra party chief kiran, vizag, kiran comment on ys jagan, sharmila and kiran kumar reddy.

jai samaikyandhra party chief kiran comment on ys jagan

షర్మిల ఏం పాపం చేసింది? కిరణ్

Posted: 04/29/2014 10:39 AM IST
Jai samaikyandhra party chief kiran comment on ys jagan

జై సమైక్యాంద్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లా రి కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తన కుటుంబానికి ఐదు టికెట్లు ఇవ్వటం పై కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. అంతేకాకుండా.. వైఎస్ షర్మిలపై నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సానుభూతి కురిపించారు.
వైఎస్ కుటుంబంలో వయసు వచ్చిన మనవళ్లు, మనవరాళ్లు ఉండే మాత్రం వారికి కూడా తప్పని సరిగా టిక్కెట్ జగన్ ఇవ్వటం జరిగేదని ఆయన అన్నారు. అయితే మొత్తం మీద పార్టీ కోసం నిత్యం కష్టపడుతున్న చెల్లెమ్మకు తీరాని అన్యాయం జరిగిందిన కిరణ్ ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది.
వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులకు ఐదు టికెట్లు కేటాయించి చరిత్ర స్రుష్టించారు. అదే బాటలో.. టీఆర్ఎస్ పార్టీ కూడా తన కుటుంబ సభ్యులకు నాలుగు టికెట్లు కేటాయించటం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే వైకాపా కుటుంబ అభ్యర్థులు వీరే. పులివెందుల నుండి జగన్, కడప నుండి జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి, కమలాపురం నుండి జగన్ మేనమామా రవీంద్రనాథ్ రెడ్డి, ఒంగోలు నుండి జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విశాఖ నుండి జగన్ తల్లి విజయమ్మకు ఎన్నికల సమరంలో పోటీ చేస్తున్నారు.
కానీ పార్టీ కోసం నిత్యం కష్టపడుతున్న షర్మిలకు అన్యాయం జరిగిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంతమందికి ఇచ్చి షర్మిలకు ఎందుకు ఇవ్వలేదు ? ఆమె ఏం పాపం చేసింది ? అని కిరణ్ జగన్ ను ప్రశ్నించారు. కిరణ్ వ్యాఖ్యలకు విశాఖ వాసులు అయోమయంలో పడ్డారు. ఒక పక్క కుటుంబ పాలన వద్దు అంటూనే.. వైకాపా ఐదు స్థానాలకు తన బంధవులకు కల్పించటం పై.. సీమాంద్ర ప్రజలు మండిపడుతున్నారు. ఇంతకి షర్మిల పై కిరన్ కుమార్ రెడ్డి ప్రేమ కురిపిస్తున్నారో, లేక అవహేళన చేస్తున్నారో.. అర్థంకాక .. సభకు వచ్చిన ప్రజలు అయోమయంతో తిరిగి వెళ్లిపోయినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles