We are also applying pain balm venkaiah naidu implies

We are also applying pain balm Venkaiah Naidu implies, BJP, Venkaiah Naidu, Telangana bil in Rajyasabha, Jairam Ramesh

We are also applying pain balm Venkaiah Naidu implies, Bharatiya Janata Party, Rajyasabha MP Venkaiah Naidu

మందు రాస్తున్నది కూడా మేమేగా అంటున్న వెంకయ్య

Posted: 03/04/2014 02:53 PM IST
We are also applying pain balm venkaiah naidu implies

తెలంగాణా బిల్లుకి మద్దతిచ్చాం నిజమే కానీ ఆ గాయానికి మందు రాయటంలే?  "మేము పట్టుబట్టబట్టే సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి తెలుసా?" అంటున్నారు వెంకయ్య నాయుడు.  హైద్రాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన వెంకయ్య నాయుడు తమ వల్లనే సీమాంధ్ర హక్కులు పరిరక్షించబడ్డాయని, సీమాంధ్రులకు న్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర విభజన ప్రక్రియలో సీమాంధ్రలో పట్టుపోగొట్టుకున్న కాంగ్రెస్ తో పాటు, తెదేపాతో పొత్తుతో కాస్తో కూస్తో అడుగు నిలబెట్టుకోవచ్చని ఆశపడ్డ భాజపా తరఫున రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్యలోనే కాంగ్రెస్ తో పోరాడినట్లుగా వాగ్వివాదానికి దిగిన భాజపా రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి చేత స్వయంగా ప్రకటనలను చేయించిన నేపథ్యంలో సీమాంధ్రలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. 

"దెబ్బ కొడితే కొట్టాం కానీ కట్టుకూడా కట్టిస్తున్నాం" అనే ధోరణిలో అసలు ప్రత్యేక ప్యాకేజ్ అనే ప్రశ్న ఉత్పన్నమైందే రాష్ట్ర విభజన వలనన్న విషయాన్ని సీమాంధ్ర ప్రజలు మర్చిపోయేట్టుగా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనపడుతున్నారు.  అసలు మంత్రులతోనే జివోఎమ్ లో ఈ నిర్ణయం తీసుకోగల కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ నియమ నిబంధనలేమీ పట్టవని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. 

అయితే నాలుగు రోజుల ముందే ఇలాంటిదేదో జరుగుతున్నదనే కాంగ్రెస్ పార్టీ  కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఆంధ్రాప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి లాంటి విషయాలను ముందే చర్చించుకున్నామని, దాన్నే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రస్తావించారు కానీ అది భాజపా సొంత ఆలోచనలేమీ కావని అన్నారు.  కానీ రెండు పార్టీలూ సీమాంధ్రకు న్యాయం చేసామన్న అంశాన్ని నొక్కి చెప్తూ అందుకు కృతజ్ఞతగా ఎన్నికలలో గెలిపించమని అడుగుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles