Governor Narasimhan Says That There Is No Differences Between Two Telugu States | Ap Politics | Telangana

Governor narasimhan says no differences in telugu states

governor narasimhan, narasimhan news, telugu states, narasimhan delhi tour, narasimhan updates, ap governor, telangana governor, cm kcr, chandrababu naidu

governor narasimhan says no differences in telugu states : Governor Narasimhan Says That There Is No Differences Between Two Telugu States In His Latest Press Conference.

‘తెలుగు రాష్ట్రాల్లో గొడవల్లేవు’ : గవర్నర్

Posted: 08/08/2015 03:16 PM IST
Governor narasimhan says no differences in telugu states

విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయిలో సమస్యలు ఏర్పడ్డాయి. అధికార పార్టీలు ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం, ప్రతి చిన్న విషయంపై ఆందోళనలు సృష్టించడం, నిందలు మోసుకోవడం.. అబ్బో కొన్నాళ్లపాటు రచ్చరచ్చ చేసేశారులెండి. ఆమధ్య రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు.. రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు తొలగిపోయాయని, ఇకనుంచి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని భావించారు.

కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ఇంతలోనే ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారాలు తెరమీదకి వచ్చాయి. అంతే.. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒకటే రాద్ధాంతం. గతకొన్నాళ్ల నుంచి కాస్త ప్రశాంత వాతావరణం వున్నప్పటికీ.. లోలోపల మాత్రం వాడీవేడీగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు వుంటే.. అసలు ఎటువంటి గొడవలు లేవని గవర్నర్ నరసింహన్ తేల్చి చెప్పేశారు. అవును.. రెండు రాష్ట్రాల్లో సమస్యలు లేవని ఆయన తాజాగా వెల్లడించారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్న గవర్నర్ నరసింహన్.. అక్కడ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే.. ప్రశాంతంగా వున్న ఆ రెండు రాష్ట్రాల మధ్య సమస్యల్ని మీడియానే సృష్టిస్తోందని ఆయన కుండబద్ధలు కొట్టేశారు.

అంటే.. మీడియా రెండు రాష్ట్రాల్లో సమస్యలు వున్నట్లు మీడియా అనవసరమైన ప్రచారం చేస్తోందని.. వాస్తవానికి ఎలాంటి సమస్యలు లేవని ఆయన అభిప్రాయం వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో సమస్యలు లేవని నరసింహన్ చెప్పిన మాటలు అందరిలోనూ కాస్త సంతోషాన్ని నింపాయే కానీ.. మీడియా మాత్రం ఆయనపై ఆగ్రహంగా వున్నట్లు వార్తలొస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor narasimhan  telugu states  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more