Vemana Sathakam in Telugu 29308 Vemana Satakalu

Vemana satakam

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu మైలకోక తోడ మాసిన తలతోడ Vemana satakam

Get the Vemana Sathakam వేమన కాలంలో కులాల పట్టింపులు ఎక్కువగా ఉండేవి. అంటరానితనం ప్రబలంగా ఉండేది. ఆచార వ్యవహారాలు ఎక్కువగా శౌచం, పరిశుభ్రతలను పాటించటంకోసం చేసిన నిబంధనలు. In Telugu Vemana Satakalu

వేమన శతకం -31

Posted: 11/17/2011 04:36 PM IST
Vemana satakam

vemana-right-img

వేమన శతకం - 31

మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు మురికితోడ నుండనేమి
అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ వినురవేమ

మైలకోకతోడ=మాసిపోయిన బట్టలతో, మాసిన తలతోడ=మురికిపట్టివున్న తలతో, ఒడలు మురికితోడ=ఒళ్ళఁతా మట్టిపట్టి, ఉండనేమి=ఉన్నట్లయితే, అగ్రకులజుడైన=అగ్రకులానికి చెందినవారినైనా సరే, నట్టిట్టు పిల్వరు=అటు ఇటు రమ్మని పిలవరు.

     పారిశుద్ధతను పాటించనివాడు అగ్రకులానికి చెందినా సరే ఆ మనిషిని ఎవరూ దగ్గరకు రానీయరు.

     వేమన కాలంలో కులాల పట్టింపులు ఎక్కువగా ఉండేవి.  అంటరానితనం ప్రబలంగా ఉండేది.  ఆచార వ్యవహారాలు ఎక్కువగా శౌచం, పరిశుభ్రతలను పాటించటంకోసం చేసిన నిబంధనలు.  ఈ సంగతి మరుగునపడిపోయి, ఆచారంలా కులాల్లో పాకిన ఆరోగ్య సూత్రాల వెనుకనున్న వాటి కారణాన్ని గుర్తుచెయ్యటం కోసమే  వేమన ఈ పద్యంలో, శుభ్రతను పాటించనివారిని ఎవరూ దగ్గరకు రానివ్వరని, పెద్ద కులంలో పుట్టినంత మాత్రాన అటువంటివారిని అక్కున చేర్చుకోరని చెప్పారు.  ఇళ్ళల్లో కూడా, పిల్లలు బయటినుంచి రాగానే, ముందు స్నానం చేసిరా, బట్టలు మార్చుకో అని ఆంక్షలు పెడుతుంటారు.  అలా అనటం వలన, శుభ్రం పడేంతవరకూ దగ్గరికి రానివ్వకపోవటమే కాదు, ఇంటి లోపలికి కూడా రానివ్వకుండా ఉండటం వలన, కొన్నాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవటం, శుభ్రంగా లేకపోతే ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుంది అనే సామాజిక బాధ్యత వస్తుంది.  విమానాలలో కానీ ఎసి భోగీల్లో కానీ, ప్రయాణం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించటం మన బాధ్యత.  ఇది కులానికి సంబంధించింది కాదు.  పారిశుభ్రతా సూత్రం.  అలాగే, సాక్స్ లోంచి కానీ, వేసుకున్న బట్టలలోంచి కానీ, నోటిలోంచి కానీ దుర్వాసన రాకుండా చూసుకోవటం ఎవరికివారు తెలుసుకుని చేసుకోవలసిన అలవాటు.  అంతరిక్షంలో ప్రయాణంచేసి వచ్చిన వ్యోమగాములు భూమి మీదకు రాగానే వారిని బయట ప్రపంచంలోకి రానివ్వరు.  వారి వలన వేరే గ్రహం నుంచి వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులు దిగుమతి కావచ్చు కదా.  వారు పెద్ద పెద్ద చదువులు చదివిన శాస్త్రఙులే మరి.  అక్కడ కుల ప్రసక్తేమైనా ఉందా.  అలాగే శుభ్రతను తెలియజేసే క్రమంలో అది అంటరానితనంగా రూపాంతరం చెందింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vemana satakam
Vemana satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more