Ashok babu speech at rythu maha garjana

Ashok babu Speech at Rythu Maha Garjana, AP NGOs President Ashok Babu, Sonia gandhi, ap bifurcation, Samaikyandhra Movement sonia gandhi,

Ashok babu Speech at Rythu Maha Garjana

విడదీసే హక్కు సోనియాకు ఎవరిచ్చారు ?

Posted: 10/02/2013 09:40 PM IST
Ashok babu speech at rythu maha garjana

వివాదస్పద ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకున్న కేంద్రం టి నోట్ పై ఎందుకు వెనక్కి వెళ్లదని ఎపిఎన్జీఓ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు ప్రశ్నించారు. ఒక వ్యక్తి చెబితే ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకుంటారా అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విడదీసే హక్కు సోనియాగాంధికి ఎవరిచ్చారని అశోక్ బాబు ప్రశ్నించారు. రెండో ఎస్సార్సీ వేస్తామంటేనే కాంగ్రెస్ ను రాష్ట్ర ప్రజలు గెలిపించారన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో జరిగిన రైతు మహా గర్జన సభలో అశోక్ బాబు ప్రసంగించారు. రైతు గర్జిస్తినే ఆ గర్జన ఢిల్లీకి వినబడుతుందని, రైతుల గురించి ఆలోచించే పరిస్థితి నేడు సమాజానికి తెలిసి వచ్చిందన్నారు. పాలు, నీళ్లలాగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ వాదులను విడదీయడానికి వచ్చిన కలియుగ హంస కెసిఆర్ అని అశోక్ బాబు అన్నారు. తాము సమ్మె 15 వరకు పొడిగించగానే తెలంగాణ నోట్ వెనక్కి వెళ్లిందని, అంటే సమ్మెలో ఉన్నంత కాలం టి నోట్ రాదని తెలిపారు.

 

రాజీనామాలు చేయాల్సిందే..

రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఎంపీలు రాజీనామా చేయాలని ఎపీఎన్జీఓలు, విద్యార్థులు ఉద్యమం ప్రారంభించడం జరిగిందని, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉద్యమం కొనసాగిస్తున్నామన్నారు. తాము రాజీనామా చేసినా స్పీకర్ ఆమోదించడం లేదని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ఒకవేళ రాజీనామాలు ఆమోదించకపోతే ప్రభుత్వం ఇచ్చిన వసతులన్ని వదిలి ప్రజల్లో కలిసిపోవాలని సూచించారు. వారు రాజీనామాలు చేయనిపక్షంలో వారి సంగతి నియోజకవర్గాల్లో తేలుస్తామని హెచ్చరించారు. వీరెవరికి భవిష్యత్ లో రాజకీయ సహకారం ఉండబోదని, మాకు సుమారు 20 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more