Kcr daughter kavitha talks on bathukamma festival

kcr daughter kavitha talks on bathukamma festival, TJF leader Kavitha, Bathukamma festival, KCR daughter, TRS Kavitha, Telangana Bathukamma, Kavita, Telangana Jagruthi president K. Kavita, T-Jagruthi Leader Kavitha speaks on bathukamma festival

kcr daughter kavitha talks on bathukamma festival T-Jagruthi Leader Kavitha speaks on bathukamma festival

బతుకమ్మ కు కొత్త అర్థం చెప్పిన కేసిఆర్ కూతురు కవిత

Posted: 09/24/2013 01:30 PM IST
Kcr daughter kavitha talks on bathukamma festival

తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రత్యేకమైన పండగ బతుకమ్మ. తెలంగాణ జీవన విధానంతో ముడిపడి ఉన్న పండగ బతుకమ్మ. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో బతుకమ్మ పండగను జరుపుకుంటారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల చివర్న లేదా తొలి అమావాస్య దినాల్లో ఆశ్వయుజమాసంలో వస్తుంది ఈ పండగ. తార్కికత, హేతువు నిర్మితం కాని రోజుల్లో అన్ని పండగలకూ దేవుడు లేదా దేవత మూలాలు ఆపాదించుకున్నట్టే ఈ పండగకూ అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ధర్మాంగదుడనే చోళరాజుకు, ఆయన భార్య సత్యవతికి నూరుగురు కొడుకులు కలిగారని, ఆ కొడుకులెవరూ బతికి బట్టకట్టలేదని, దాంతో రాజు లక్ష్మీదేవిని తనకు సంతానం కావాలని కోరితే ఆమె వరప్రసాదం వల్ల కూతురు జన్మించిందని, ఆ కూతురికే కలకాలం జీవించి ఉండేలా బతుకమ్మ (బతుకు+అమ్మ) పేరు పెట్టారని, ఆమె పేరిటే తెలంగాణ ఆడపడుచులు ఏటేటా 'బతుకమ్మ' ఆడుతున్నారని ప్రతీతి. ఇక గౌరీదేవి మహిషాసురుని నిర్మూలించే క్ర మంలో నిద్రలోకి జారుకున్నదని, మహర్షులు ఆమెను తొమ్మిది రోజుల అనంతరం నిద్రలోంచి మేల్కొలిపారని, అందువల్లే నవరాత్రుల పూజల సందర్భంగా 'బతుకమ్మ' ఆట ఆడుతారని మరో ప్రతీతి. జాగృతి అంటేనే బతుకమ్మ అని, ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జీవన విధానాన్ని బతుకమ్మ ద్వారా వెలిగెత్తి చాటుతున్నామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బంగారు బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆంధ్రా పాలనలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. వాటిని పునర్ నిర్మించడమే జాగృతి లక్ష్యమని ఆమె చెప్పారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం వనరులను రక్షించడం కోసం సుశిక్షితులైన సైనికులను తయారు చేశామని చెప్పారు. జాగృతి అనుబంధ సంస్థలను కూడా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సామాజిక పరిస్థితులను అంచనా వేస్తూ జాగృతి అన్ని విభాగాల కార్యకర్తలు చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more