Ntr and harikrishna do not attend bkr daughter marriage

NTR and Harikrishna do not attend bkr daughter marriage, Jr NTR, Balakrishna daughter wedding, Nandamuri Tejaswini wedding, NTR misses Tejaswini wedding,

NTR and Harikrishna do not attend balayya daughter marriage, Jr NTR Hari Krishna missing in Balayya daughter wedding

పెళ్లి సాక్షిగా బయటపడిన అన్నదమ్ముల వార్

Posted: 08/21/2013 05:49 PM IST
Ntr and harikrishna do not attend bkr daughter marriage

నందమూరి బాలకృష్ణ తనయ తేజస్విని పెళ్లికి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం హాజరు కాలేదు. బాలయ్య కూతురు తేజస్విని వివాహం హైదరాబాదులోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు హాజరు కాలేదు. వారిద్దరు పెళ్లికి హాజరు కాకపోవడం ఇటు రాజకీయవర్గాల్లో, అటు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తమ కుటుంబం మధ్య ఎలాంటి విబేధాలు లేవని తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చినా..... బాలకృష్ణ. తన చిన్న కుమార్తె తేజస్విని వివాహం వేదికగా అన్నదమ్ముల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. బాలయ్య ఇంట శుభకార్యానికి ఆయన సోదరుడు, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవటం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది.

 

మరోవైపు అసలు జూనియర్ ఎన్టీఆర్ కు వివాహ ఆహ్వానం అందలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ల మధ్య ఏర్పడ్డ విభేదాల కారణంగానే ఎన్టీఆర్ కు పెళ్లిపిలుపు అందలేదన్న చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ను పెళ్లికి పిలవనందునే హరికృష్ణ కూడా ఈ వివాహా కార్యాక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తేజస్విని వివాహ వేడుకను జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో టీవీలో వీక్షించినట్లు సమాచారం. ఇక హరికృష్ణ, బాలకృష్ణల మధ్య విబేధాలు చోటు చేసుకున్న సంగతి బహిరంగ రహస్యమే. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ వివాహం చేసుకున్న తర్వాత బాలయ్య, బాబుల దోస్తీ మరింత బలపడింది. బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వని విషయంలో ఏర్పడిన విబేధాలు హరికృష్ణకు చంద్రబాబుకు మధ్య అంతరం పెంచాయి. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు తన తనయుడు లోకేష్‌కు అప్పగించాలనే ప్రయత్నాలతోనే వారు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా సోదరుడు బాలయ్య భవిష్యత్తులో బావ నుండి పార్టీ బాధ్యతలు తీసుకొని ‘ముఖ్య’ పదవులను అధిష్టించడమో లేక తన అల్లుడు లోకేష్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

 

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ చేతికి పగ్గాలు పోతే పార్టీ తన చేతుల్లోకి రావడం కుదరదని భావించి పార్టీలో పట్టుకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ మధ్యకాలంలో బాలయ్య,ఎన్టీఆర్ లు కొన్ని వేదికలపై కలిసి కనిపించినా, తదుపరి కాలంలో మళ్లీ అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఆ కారణంగానే జూనియర్ తన మావయ్య, బాబాయ్‌ల పైన అసంతృప్తితోనే ఉన్నారనే ప్రచారం జరిగింది. తెలంగాణకు అనుకూలంగా టిడిపి కచ్చితమైన స్టాండ్ తీసుకుంటే... వ్యక్తిగతమంటూ హరికృష్ణ నిన్న సమైక్యాంధ్రకు అనుకూలంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇప్పుడు బాలయ్య కూతురు పెళ్లికి దూరంగా ఉన్నారు. వీటన్నిటిని పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు హరికృష్ణ సీమాంధ్రలో పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఏమైన పెళ్లి వేడుకలో హరిక్రిష్ణ , ఎన్టీఆర్ రాకపోవటం మంచి విషయం కాదని, సొంత సోదరుడు ఇంటిలో పెళ్లికి రాకపోవటం పై , నందమూరి కుటుంబం పై అనేక పుకార్లు షికార్లు చేస్తాయని నందమూరి తారక రామారావు అభిమానులు, సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. సొంత ఇంట్లో పెళ్లి రోజే శత్రువులుగా మారిన అన్నదమ్ములుగా తెలుగు ప్రజలు చెప్పుకుంటారనే మాటలు పెళ్లికి వచ్చిన అతిథుల మద్య వినిస్తున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more