Collective decision of semandhra leaders

Semandhra leaders collective decision, Andhra leaders meet at AP Bhavan, Andhra leaders' letter to Sonia, Jawaharlal Nehru, Indira Gandhi, Chiranjeevi, Pallam Raju, Kavuri Sambasiva Rao

collective decision of Semandhra leaders

సీమాంధ్ర నాయకుల ఉమ్మడి నిర్ణయం

Posted: 07/27/2013 11:54 AM IST
Collective decision of semandhra leaders

కాంగ్రెస్ కోర్ కమిటీలో రాష్ట్ర విభజన మీద తర్జన భర్జనలు జరుగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఎ.పి.భవన్ లో సమావేశమై తమ తీర్మానాన్ని సోనియా గాంధీకి లేఖలో వివరించారు.  

ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి రాష్ట్రాన్ని విభజించవద్దన్న తమ కోరికను విస్మరించినట్లయితే తామంతా కలిసి కఠిన మైన నిర్ణయాలను తీసుకోవలసి వస్తుందని సీమాంధ్ర నేతలు సమావేశంలో స్పష్టం చేసారు. 

రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు సమావేశమై గంటన్నర సేపు చర్చించి చేసిన నిర్ణయాన్ని సోనియా గాంధీకి రాసిన లేఖలో పొందుపరుస్తూ ఆ లేఖను ఆమెకు అందజేసే బాధ్యతను, రాష్ట్రాన్ని విభజించవద్దని ఆమెకు నచ్చజెప్పే బాధ్యతను కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్ళంరాజులకు అప్పజెప్పారు. 

జవహార్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1956 లో జరిగిన రాష్ట్రావతరణ దగ్గర్నుంచి అన్ని విషయాలను ఆ లేఖలో వివరిస్తూ, 1969 లో ఇందిరా గాంధీ కానీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ కానీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ, రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అపఖ్యాతిని తలెకెత్తుకోవద్దని కోరారు.  తమని సంప్రదించకుండా తెలంగాణా మీద నిర్ణయం తీసుకున్నట్లయితే తామంతా కలిసి అందుకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుందని కూడా ఆ లేఖలో స్పష్టం చేసారు. 

అయితే ఇంకా ఏమీ తేలలేదని, అందరినీ సంప్రదించకుండా రాష్ట్ర విభజన ఎలా జరుగుతుందని మంత్రి శైలజానాథ్ అన్నారు.  ఒకవేళ అలాగే గనక నిర్ణయం జరిగితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి నిర్ణయం తీసుకుని దానికనుగుణంగా చెయ్యవలసిన కార్యకలాపాలను చేపడతామని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more