Congress spokesman janardan dwivedi announces now

congress spokesman, janardan dwivedi, chidambaram, pranab mukherjee, sushil kumar shinde, digvijay singh, gulam nabi azad

Congress spokesman janardan dwivedi announces now

ప్రకటనలకు కొత్త ముఖాలు

Posted: 07/13/2013 03:24 PM IST
Congress spokesman janardan dwivedi announces now

పార్లమెంటు సమావేశాలకు ముందే కొన్ని ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని, అందులో తెలంగాణా అంశం ప్రముఖపాత్ర వహిస్తుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది ఈరోజు ఢిల్లీలో అన్నారు. 

తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లా మరే పార్టీకీ ఈ విధంగా తాత్సారం చేస్తూ వెళ్ళటం సాధ్యం కాకపోవును.  పార్టీ చెయ్యదలచుకుంటే ఆఘమేఘాల మీద పని అయిపోతుంది.  చెయ్యదలచుకోకపోతే కావలసినన్ని వంకలు- కమిటీలు, ఏకాభిప్రాయాలు, విధివిధానాలు, చట్ట సవరణలు, కోర్ కమిటీ, వర్కింగ్ కమిటీ ఇలా ఎన్నో. 

అయితే ఈ లోపులో బుజ్జగించేవాళ్ళు కూడా కావాలి కాబట్టి కొందరు విశ్వాసపాత్రులైన కేంద్ర మంత్రులు ఆ గురుతర బాధ్యతను తలకెత్తుకుంటారు. 

అలా ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రస్తుత రాష్ట్రపతి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ల ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం కొన్ని ప్రకటనలు, కొన్ని వాగ్దానాలు చేయించింది.  గులామ్ నబి ఆజాద్ కొంతకాలం హడావిడి చేసారు.   ఆ తర్వాత దిగ్విజియ్ సింగ్ వచ్చి ఇంకేముంది అయిపోయింది ఇక తెలంగాణా ఇచ్చెయ్యటమే పట్టండి జోలె, ఈ లోపులో తీసుకోండి స్వీటు, చేసుకోండి మీ నోరు తీపి అంటూ చెప్పుకొచ్చారు.  మన రాష్ట్ర నాయకులంతా గబగబా దిగ్విజయ్ సింగ్ ని కలవటం వారి వారి గోడులన్నీ వెళ్ళబుచ్చటం జరిగింది.  ఎంతో సమర్థవంతంగా దిగ్విజయ్ సింగ్ కి నచ్చజెప్పి, ఆయన అన్నీ ఓపిగ్గా వింటే, చాలా బాగా ఆయన్ని బుట్టలో వేసామని మన నాయకులు వాళ్ళకి వాళ్ళే శభాష్ అని భుజం చరుచుకున్నారు.

తీరా చేస్తే నిన్న కోర్ కమిటీ తుస్సుమంది.  దానికోసం నాలుగు రోజులుగా కసరత్తు చేసి మరీ వెళ్ళారు రాష్ట్రంలో ని నాయకత్రయం.  కమిటీ ముందు భేటీ, తర్వాత భేటి, ఒకరోజు ఆగి మరీ భేటీ ఇలా భేటీల మీద భేటీలు జరిగాయి కానీ అవన్నీ దిగ్విజయ్ సింగ్ వరకే పరిమితమయ్యాయి.

ఇక ప్రకటనలు చెయ్యటానికి కొత్త ముఖం కావాలనుకుందేమో కాంగ్రెస్ పార్టీ తమ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చేత ఆ ప్రకటన చేయించింది.  అయితే ఇక ఇప్పుడు చాలా మందికి అర్థమైపోయింది- మౌత్ పీస్ ఒకటే కానీ స్పీకర్లు వేరు వేరని.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more