Telugu desam chandrababu naidu speech in tdp mahanadu 2013

chandrababu naidu, chandrababu naidu speech in tdp mahanadu 2013, chandrababu naidus speech in mahanadu, vastunna meekosam padayatra, babu, tdp cadre, tdp leaders,

Chandrababu Naidu speech in TDP Mahanadu 2013

టిడిపి నాయకుల్లో కొత్త ఉత్సహం

Posted: 05/27/2013 06:10 PM IST
Telugu desam chandrababu naidu speech in tdp mahanadu 2013

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టిడిపి నాయకుల్లో కొత్త ఉత్సహం నింపారు. 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర తన జీవితంలో మరువరాని ఘట్టం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గండిపేటలో జరుగుతున్న 32వ టీడీపీ మహానాడులో బాబు ప్రసంగించారు. పాదయాత్రలో తనను నడిపించింది కార్యకర్తలే అని తెలిపారు. సమాజంలో మార్పు, అవినీతి ప్రక్షాళన కోసం యువత ముందుకు రావాలని బాబు పిలుపు నిచ్చారు.

కాంగ్రెస్ దుష్టపాలన వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆయన ద్వజమెత్తారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, అసమర్థ ప్రభుత్వంతో రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. విద్యుత్ సమస్యతో పరిశ్రమలు మూతపడ్డాయని, వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. విద్యుత్ సమస్యతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మహస్తం మొండిహస్తం అన్న తన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, బెల్టుషాపులను వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. పేదల భూములను కారుచౌకగా కొట్టేసి పెత్తందార్లకు కట్టబెట్టారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 11 వేల కోట్లు ఖర్చుపెట్టి 30 లక్షల ఎకరాలకు నీరిచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరివ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. సీబీఐ అన్ని చార్జిషీట్లలో జగన్‌ను దోషిగా చూపించారని,

జగన్ అరెస్ట్ అయినా...దొంగమంత్రులు కొనసాగుతున్నారన్నారు. కళంకిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని బాబు డిమాండ్ చేశారు. టీడీపీ పోరాటం వల్లే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని తెలిపారు. పార్టీలో అవినీతిపరులను ఉపేక్షించబోమని, అవినీతిపరులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more