Tollywood power star pawan kalyan joining tdp

pawan kalyan,power star pawan kalyan, telugu-desam, tdp, chandrababu naidu, pawan kalyan join to tdp, actor ali, lokesh babu, junior ntr, balakrishna, harishna, congress party, jayaprada, rajamandry, junior ntr,

power star pawan kalyan joining tdp

టిడిపి మహనాడులో లో పవన్ కళ్యాణ్?

Posted: 05/25/2013 05:23 PM IST
Tollywood power star pawan kalyan joining tdp

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అపరచాణుక్యుడు. ఎప్పుడు, ఎవరికి ఎలా గాలం వేస్తాడో ఎవరికి అర్థం కాదు. అయితే ఇటీవల కాలంలో ఆయనకు అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. సొంత కుటుంబం నుండి చంద్రబాబుకు తిరుగుబాటు మొదలైన విషయం తెలిసిందే. చంద్రబాబు తో జూనియర్ ఎన్టీఆర్, హరిక్రిష్ణ ల మధ్య వివాదం ముదిరిన విషయం తెలిసిందే. హరిక్రిష్ణ తో సంది సమావేశాలు ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరకు సై అంటే సై అంటూ నారా వారు నందమూరి వారు తోడలు కొట్టుకునే స్థాయికి వివాదం ముదిరిపోయింది. బాలయ్య, అన్న హరిక్రిష్ణతో జరిపిన రాయభారం కూడా ఫలించలేదు. చంద్రబాబుకు అండగా బాలయ్య ఉన్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టడానికి ఒక పవర్ హీరోను టిడిపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అతనే మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరుపుతున్నట్లు సినీ జనాలు అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సిద్దంగా ఉన్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు మరో కామెడీ నటుడు డాక్టరు అలీతో చంద్రబాబు వర్గం చర్చలు జరిపి, రాజమండ్రి టిక్కెట్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలను ఎలా పట్టాలి? ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఎలా పడగొట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసునని టీడీపీ నాయకులు అంటున్నారు. త్వరలో జరగనున్న మహానాడులో పవన్ కళ్యాణ్ ను, అలీ పేర్లను ప్రకటించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టేందుకే పవన్ పవర్ ను బాబు ఉపయోగించుకుంటున్నారని రాజకీయ నాయకులు అంటున్నారు. డాక్టరు అలీ వల్ల టిడిపి ఉపయోగం ఏమిటి అంటే? కాంగ్రెస్ పార్టీ నుండి రాబోయే ఎన్నికల్లో సినీ నటి జయప్రధ పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో బ్రహ్మనందం తరువాత సెకండ్ స్థానంలో ఉన్న వ్యక్తి డాక్టర్ అలీ. అంతేకాకుండా అలీ దగ్గర కూడా డబ్బులు బాగానే ఉన్నాయి. ముఖ్య విషయం ఏమిటంటే.. అలీ సొంత ఊరు రాజమండ్రి కావటం విశేషం. సినీ నటి జయప్రద మీద పోటీగా డాక్టర్ అలీ అయితే గెలుపు ఖాయమాని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. జరగబోయే మహనాడులో ..మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కొత్త సందడి వస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more