Kanna laxminarayana refuses chandrababu allegations

kanna lakshminarayana, cbi probe, tdp ex ministers, chandrababu naidu, tdp

Minster Kanna Lakshminarayana refuted the Telugudesam party president Nara Chandrababu Naidu for making allegations against him in the YSR Congress YS Jagan case.

నన్ను ఎదుర్కోలేకనే...

Posted: 05/14/2013 06:44 PM IST
Kanna laxminarayana refuses chandrababu allegations

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ పై తెలుగు దేశానికి చెందిన ముగ్గురు నాయకులు, (మాజీ మంత్రులు) జగన్ అక్రమాస్తుల కేసులో ఈయనకు సంబంధం ఉందని కోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కన్నా స్పందిస్తూ.... జగన్ అక్రమాస్తులలో గానీ, వారు ఆధారంగా చూపుతూ వేసిన జీవోలతో సంబంధం లేదని, ఆ జీవోలు జారీ చేసినప్పుడు నేను ఆ శాఖ మంత్రినే కానే కాదని, అలాంటప్పుడు వీరు ఏ ఆధారాలతో పిల్ వేశారని ప్రశ్నించారు. నేను కేవలం 2010 లో కేవలం పాత జీఓకు అనుబందంగా ఆర్ధిక శాఖ కార్యదర్శి ఇచ్చిన మెమో అని ఆయన అన్నారు. ఒక కోర్టులో ఈ పిల్ వేసిన వారు మాజీ మంత్రులేనని వారికి జీవోలకు, మెమోలకు తేడా తెలియకుండా వేశారని ఎద్దేవ చేశారు. రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేకనే తనపై కూడా ఇలాంటి పిల్ వేశారని అన్నారు.

మరో వైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర కన్నా పై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కళంకిత మంత్రులను తొలగించాలను గవర్నర్ ని కలిసిన నేపథ్యంలో కన్నా చేసిన వ్యాఖ్యలకు జవాబుగా ఆయన మాట్లాడారు. మంత్రి కన్నా ఒకప్పుడు కూలి పని చేసుకునేవాడని, అలాంటి ఆయన ఇవాళ వందల కోట్లు ఎలా సంపాదించాడని, జగన్ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేకుంటే ఆయన  స్వచ్చంధంగా ఆస్తుల పై సీబీఐ విచారణ కోరాలని, సీబీఐ విచారణలో ఎన్ని అక్రమాస్తులు ఉన్నాయో తాము రుజువు చేసి చూపిస్తామని అన్నారు. మరో టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ మాట్లాడుతూ... కన్నా ఎమ్మెల్యేకు ఎక్కువ, మంత్రికి తక్కువ అని అన్నారు. వీరి సవాల్ కి కన్నా ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more