Elugu movie news nayanthara and charmi third time hot romance in tollywood

nayanthara, actress nayanatara, charmi, actress charmi, nayana tara third time chance, balakrishna-nayana tara, charmi hot movie, charmi hot stills, charmi latest movie, nayana tara latest movie, nayana tara greekveerudu movie, director boyapati srinu

nayanthara and charmi third time hot romance in tollywood

ఈ ముద్దుగుమ్మలకు ముచ్చటగా మూడోసారి ?

Posted: 05/04/2013 12:22 PM IST
Elugu movie news nayanthara and charmi third time hot romance in tollywood

నయనతార టైమ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది...’ తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇది. ప్రభుదేవాతో విఫల ప్రేమాయణం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ప్రస్తుతం భారీ అవకాశాలతో దూసుకుపోతోంది. నాగార్జున సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం ‘గ్రీకువీరుడు’  ప్రేక్షకులముందుకొచ్చింది. ఇదిలావుండగా ఈ సుందరి బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి నటించనుందని తెలుస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా నయనతారను ఎంపికచేసినట్లు సమాచారం. ‘సింహా’ ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లో బాలకృష్ణ సరసన నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది నయనతార. ప్రేక్షకుల్లో వీరిద్దరికీ హిట్‌పెయిర్ అనే గుర్తింపు వుంది. ఆ సెంటిమెంట్ దృష్ట్యానే నయనతారను కథానాయికగా ఎంపికచేశారని తెలిసింది.

ఛార్మి కథానాయికగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మంత్ర ’ ఏస్థాయి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తులసీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఛార్మీకి మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మంగళ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్లీ వీరిద్దరు ముచ్చటగా మూడవసారి కలిసిపనిచేయబోతున్నారని తెలిసింది. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సి.హెచ్.వి. శర్మ నిర్మించబోతున్నారు. తులసీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఛార్మి ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుందని చిత్ర వర్గాల సమాచారం. ‘మంత్ర’ తరువాత కథానాయికగా ఆ స్థాయి విజయాన్ని అందుకోని ఛార్మి తాజా చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకోవాలని భావిస్తోందట. ఇటీవల కథానాయిక వేశాలు పక్కన పెట్టి ప్రత్యేక గీతాల్లో మురిపించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘టెన్త్‌క్లాస్’ ఫేమ్ చందు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రేమ ఒక మైకం’లో నటిస్తోంది. ఈ సినిమాలో ఛార్మీ వేశ్య పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more