ఈరోజు సాయంత్రం శనిగ్రహం భూమికి దగ్గర్లోకి రావటం వలన మనం ఎటువంటి పరికరం లేకుండానే కంటితో చూడవచ్చు. ప్రతి సంవత్సరం శనిగ్రహం మనకు దర్శనమిస్తుందన్నది నిజమే కానీ ఈ సారి ప్రత్యేకతలు ఇవి-
సూర్యుడికి ఎదురుగా- అంటే వ్యతిరేక దిశలో కనపడటం. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో తూర్పున ఉదయించే శనిగ్రహం, రేపు తెల్లవారు ఝామున తూర్పున పొద్దు పొడుస్తుంటే పశ్చిమాన అస్తమించటం విశేషం.
2023 వరకు, అంటే మరో దశాబ్ద కాలం వరకు ఇంత దగ్గరగా చూడలేము.
నక్షత్రంలా వెలిగి మలిగిపోతూ కాకుండా నిరంతరంగా కాంతులీనుతూ కనిపించే శనిగ్రహాన్ని కంటితో చూడవచ్చు, బైనాక్యులర్స్ తో శనిగ్రహం వలయాలను కూడా చూడవచ్చు. పోయిన సంవత్సరం ఏప్రెల్ 15 న దర్శనమిచ్చిన శనిగ్రహం ఈ సంవత్సరం 28న వస్తుంటే వచ్చే సంవత్సరం మే 10న తిరగి కనిపించబోతున్నది. కానీ 2023 వరకు ఇంత దగ్గరగా మళ్ళీ చూడలేము. శని గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలను చూడలంటే మాత్రం టెలిస్కోప్ కావలసిందే.
భారతదేశంలో గ్రహాల కదిలకలతో జరిగే పరిణామాలను లెక్కించే శాస్త్రాల్లో ఏ రాశిలో ఉంటుంది, ఏ స్థానంలో ఉంటుందన్నదానిమీద ఫలితాలను చెప్తారు కానీ భూమికి ఎంత దూరంలో ఉందన్న లెక్కతో సంబంధం లేదు కాబట్టి ఈ రోజు నిర్భయంగా శనిగ్రహాన్ని చూడవచ్చు. మనవాళ్ళు గ్రహాలలో ఎక్కువ భయపడేది శనిగ్రహానికే. కానీ శని మంచి చేసే పరిస్థితులు కూడా ఉంటాయని గ్రహబలాలలో చెప్తారు. అయితే, శని అంటే చెడు అన్న ఒక అభిప్రాయం లోతుగా పడిపోయింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more