Young heroes plays villains in tollywood

tollywood young heroes, rana, navadeep, sumanth, villains, negative role in tollywood, tollywood movies, young heroes nagative role,

young heroes plays villains in tollywood

young heroes plays villains.gif

Posted: 01/28/2013 04:24 PM IST
Young heroes plays villains in tollywood

young heroes plays villains in tollywood

తెలుగు హీరోల మైండ్ సెట్ మారిపోతుంది?  హీరోలుగా వెండి తెరపై కనిపించిన వారే ఇప్పుడు  విలన్ గా మారిపోతున్నారు. అందరు హీరోలు అయితే  విలన్ ఎక్కడి నుంచి వస్తారు? అందుకే కొంతమంది హీరోలు  విలన్లుగా మారటానికి సిద్దంగా ఉన్నారని సమాచారం.  ఒకప్పుడు విలన్‌ వేషాలు వేస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హీరోలయినవాళ్లు మన టాలీవుడ్‌లో ఎందరో ఉన్నారు. ఇప్పటి యంగ్‌ జనరేషన్‌లో ప్రతి ఒక్కరూ హీరోలుగానే చేయాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వస్తుంటారు. అందరూ హీరోలుగానే చేయాలంటే కుదరదు. ఒక్కోసారి బాడీ లాంగ్వేజ్‌ను బట్టి విలన్‌గా కూడా చేయాల్సి ఉంటుంది. గతంలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, గోపీచంద్‌ తదితరులు కోవకే వస్తారు. అయితే ఇప్పటి యంగ్‌ హీరోలు అవకాశం వస్తే విలన్లుగా చేయడానికి వెనకాడమంటున్నారు. ఒకప్పుడు హీరో సుమన్‌, సురేష్‌లు ఇప్పుడు విలన్‌ వేషాలు వేస్తున్నారు. ఇప్పటి యంగ్‌ హీరోలలో తారకరత్న ఇప్పటికే ‘అమరావతి’ చిత్రంలో విలన్‌గా నటించి నంది అవార్డును కూడా పొందారు. మళ్లీ హీరోగా చేస్తూనే అవకాశం ఉంటే తప్పకుండా విలన్‌గా చేస్తానంటున్నారు. రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో రానా దగ్గుపాటి ప్రధాన విలన్‌గా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు అది ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఇక హీరో సుమంత్‌ ఇప్పటిదాకా చేసిన చిత్రాలలో పెద్దగా విజయం సాధించిన చిత్రాలేమీ లేవు. కాగా ఇటీవల తన మనసులోని మాట బయటపెట్టారు.

young heroes plays villains in tollywood

విలన్‌గా అవకాశం వస్తే వదులుకోనని...ఎప్పటినుంచో చెయ్యాలని అనుకుంటున్నానని అన్నారు. అలాగే తేజ స్కూల్‌ నుంచి వచ్చిన హీరో నవదీప్‌కు ఇప్పటిదాకా హీరోగా బ్రేక్‌ ఇచ్చిన సినిమా ఏమీ లేదు. లేటెస్ట్‌గా జూ.ఎన్‌టిఆర్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ‘బాద్‌షా’లో విలన్‌గా చేస్తున్నాడు. మంచు మనోజ్‌ కూడా ‘కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రంలో విలన్‌ షేడ్స్‌లో ఉండే క్యారెక్టర్‌ను మెప్పించాడు. మిస్టర్‌ నూకయ్య చిత్రంలోని పాత్ర కూడా అలాగే ఉంటుంది. మనోజ్‌ను కూడా ప్రేక్షకులు ఆయన తండ్రి మోహన్‌బాబులా విలన్‌గా చూడాలనుకుంటున్నారు. అందుకు మనోజ్‌ కూడా సిద్ధంగానే ఉన్నాడు. సరైన కథ దొరికితే విలన్‌గా నటిస్తానంటున్నాడు. ఎలాగూ తెలుగులో విలన్ల కొరత బాగానే ఉంది. విలన్లు లేని కొరత తీరినట్లవుతుంది. అలాగే విలన్‌గా రాణిస్తూనే హీరోగా గుర్తింపు ఉన్న పాత్రలు చేయవచ్చు. ఒక్క సారి విలన్‌గా చేసినంత మాత్రాన విలన్‌గానే స్థిరపడిపోరు.  హీరోగా గుర్తింపు తెచ్చుకున్న  మన తెలుగు హీరోలు విలన్ గా అయిన మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుందాం. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajnath singh venkaiah naidu fire on congress party
Congress leaders face ire of pro telangana protesters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more