డ్రగ్స్ కోరల్లో చిక్కితే జీవితం ఛిన్నాభిన్నం అవుతుందన్నది కాదనలేని సత్యం. మత్తుకు బానిసలైతే.. జీవితంలోని ఎన్నో మధురానుభూతులను వదులుకోవాల్సి వస్తుంది. కేవలం మత్తే జీవితం కారాదని ఇప్పటికే పంజాబ్ యువతకు ఉడ్తా పంజాబ్ సహా పలు చిత్రాలు కళ్లకుకట్టినట్లు చూపాయి. వీటి వల్ల కలిగే నష్టాలు ఏమిటో కూడా తెలిసేలా చేశాయి. అయినా కొందరు యువత మాత్రం మత్తుపదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో అక్రమంగా డ్రగ్స్ తీసుకుంటున్న బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది.
ఇక తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోనే అందుకు నిదర్శనం. మత్తులో జోగుతున్న ఓ యువతి అందులోని నిషాను నషాలానికి ఎక్కించుకుని ఎంత ఇబ్బంది పడుతుందో. తాత్కాలికమైన ఈ మత్తుతో సభ్యసమాజంలో తమ పరువు మర్యాదలకు ఎంతటి విఘాతం కలుగుతుందో అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. తూర్పు అమృత్‌సర్ నియోజకవర్గం మక్బూల్‌పూర్ ప్రాంతంలో ఓ యువతి డ్రగ్స్ మత్తులో విలవిల్లాడింది. రోడ్డుపై నిలబడిన ఆమె కనీసం అడుగు తీసి అడుగు వేయడానికే ఆపసోపాలు పడింది. కాలు కూడా కదల్చలేని స్థితిలో వణుకుతూ కన్పించింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆదివారం స్థానికంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ముగ్గురు నిందితుల నుంచి నార్కోటిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐదు వాహనాలను కూడా సీజ్ చేశారు. వీటిని దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులతో మక్బూల్‌పురా ప్రాంతం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ అధికారులు ఎన్నో డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇక్కడ ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బాధితులయ్యారు.
A viral video from Amritsar, Punjab shows a woman on the streets allegedly under the influence of heavy, illegal drugs. She is seen struggling to take a step forward. Officials have started a probe into this issue. Watch the video to know more#Punjab #DrugAbuse #PunjabWoman pic.twitter.com/A6GPrRR6xE
— Mirror Now (@MirrorNow) September 12, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more