Doctor runs 3 km to perform operation in time అత్యవసర వైద్యం చికిత్స.. పేషంట్ కోసం డాక్టర్ పరుగు.!

Doctor runs 3 km to perform crucial surgery on time leaves his car behind

Bengaluru Doctor, Dr Govind Nandakumar, gastroenterology surgeon, emergency surgery, laparoscopic gallbladder surgery, Traffic jam, Manipal Hospital, Sarjapur, Sarjapur-Marathahalli Road, Bengaluru, Karnataka, crime

It was a matter of life and death for a patient. A doctor, who was getting late for his surgery because of the notorious Bengaluru traffic, decided to abandon his car, and run the rest of the distance to the hospital. Dr Govind Nandakumar, a gastroenterology surgeon, was driving to Manipal Hospital, Sarjapur, to perform an emergency laparoscopic gallbladder surgery. When he was in the last stretch of his journey, he realised he was getting horribly late.

వైరల్: అత్యవసర వైద్యం చికిత్స.. పేషంట్ కోసం డాక్టర్ పరుగు.!

Posted: 09/12/2022 05:48 PM IST
Doctor runs 3 km to perform crucial surgery on time leaves his car behind

ట్రాఫిక్‌ నగరం.. సారీ నరకం.. ఇది ఏ నగర ప్రజలకైనా షరామామూలే. అయితే మరీ ముఖ్యంగా దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ సమస్య గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచింది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఇది పెనుభూతం. అందులో సైబర్ నగరంగా వెలుగొందుతున్న బెంగళూరులో ఇది సమస్య మరింత ఎక్కువ. ఇక అక్కడి ప్రజలకు ఈ సమస్య నిత్యానుభవం. మామూలు రోజుల్లోనే ఆ ఐటీ నగరంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. అందునా తాజాగా వర్షాలతో రోడ్లు దెబ్బతిని పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అయితే అలాంటి పరిస్థితుల్లో.. తన పేషెంట్‌ కోసం పరుగులు తీసిన ఓ డాక్టర్‌ను ఇప్పుడంతా ‘శభాష్‌’ అని అభినందిస్తున్నారు.

మణిపాల్ హాస్పిటల్‌లో పనిచేసే గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ గోవింద్ నందకుమార్ ఎప్పట్లాగే  ఆస్పత్రికి బయలుదేరారు. ఒక మహిళకు గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విపరీతంగా ట్రాఫిక్ ఉండటంతో ఆయన ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో ఏం చేయాలో ఆయనకు తోచలేదు. ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చేసి కారు దిగి అవతలి రోడ్డుకు చేరుకున్నారు. గూగుల్‌ మ్యాప్‌లో చూసేసరికి ఆ దూరం 45 నిమిషాలు చూపించింది. అయితే ఆయన అలస్యం చేయకుండా.. పరుగున మూడు కిలోమీటర్లలో ఆస్పత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో సదరు మహిళను అనుకున్న సమయానికే డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

తన కోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నారన్న ఆలోచనతో ఇంకేం ఆలోచించకుండా ఆస్పత్రికి పరుగుతీశానని డాక్టర్ గోవింద్ నందకుమార్ చెప్తున్నారు. ‘‘కన్నింగ్‌హామ్ రోడ్డు నుంచి సర్జాపూర్‌లోని మణిపాల్ ఆసుపత్రికి చేరుకోవాల్సి వచ్చింది. భారీ వర్షాలు, నీటి ఎద్దడి కారణంగా ఆస్పత్రికి కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నా పేషెంట్లు సర్జరీ పూర్తయ్యే వరకు భోజనం చేయడానికి అనుమతించనందున, ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వేచి ఉండే సమయాన్ని వృథా చేయకూడదనుకున్నాను.

నాకు డ్రైవర్ ఉన్నాడు, కాబట్టి, నేను కారును వెనుక వదిలి వెళ్ళగలిగాను. నేను క్రమం తప్పకుండా జిమ్ చేయడం వల్ల నాకు పరుగెత్తడం ఈజీ అయ్యింది. నేను ఆసుపత్రికి మూడు కిలోమీటర్లు పరిగెత్తాను. శస్త్రచికిత్సకు సమయానికి చేరుకోగలిగాను. రోగులు, వారి కుటుంబాలు కూడా డాక్టర్ల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాయి. అయితే.. అంబులెన్స్‌లో ఉన్న రోగి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి? అంబులెన్స్ వెళ్లేందుకు కూడా స్థలం లేదు అని గోవింద్‌ తన వీడియోను కర్నాటక ముఖ్యమంత్రికి ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం డాక్టర్‌ గోవింద్‌పై సోషల్‌ మీడియాలో ఈయన చర్యపై ప్రశంసలు కురుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles