CBI, PM Modi Gave Me 'Clean Chit' Says Manish Sisodia నాకు, నా కుటుంబానికి ప్రధాని, సీబిఐ క్లీన్ చిట్: మనీష్ సిసోడియా

Cbi pm modi gave me clean chit nothing found during search of bank locker manish sisodia

Aam Aadmi Party (AAP), Delhi Deputy CM, Manish Sisodia, Central Bureau of Investigation (CBI), PM Narendra Modi, liquor scam, clean chit, Punjab National Bank (PNB), Ghaziabad's Sector, Arvind Kejriwal, Manish Sisodia Bank Locker, Manish Sisodia In Delhi Assembly, CBI On Manish Sisodia, Manish Sisodia In Delhi Liquor Scam, Manish Sisodia On Modi Govt, Vasundhara, Uttar pradesh, Delhi politics

Delhi Deputy Chief Minister Manish Sisodia claimed that the CBI found nothing in his bank locker after the probe agency checked the deposit box in connection with the alleged liquor scam. Sisodia said that he and his family got a written clean chit from the CBI. According to reports, a team of CBI officials arrived that the Punjab National Bank (PNB) branch in Ghaziabad's Sector in Vasundhara to search Sisodia's bank account.

నాకు, నా కుటుంబానికి ప్రధాని, సీబిఐ క్లీన్ చిట్: మనీష్ సిసోడియా

Posted: 08/30/2022 06:01 PM IST
Cbi pm modi gave me clean chit nothing found during search of bank locker manish sisodia

లిక్క‌ర్ పాల‌సీ కేసులో అవకతవకలు జరిగాయని.. అరోపణలు రావడంతో వెనువెంటనే చర్యలకు ఉపక్రమించిన సీబిఐ వాటి లెక్కలు తేల్చాని కేసు నమోదు చేసి ఇందుకు సంబంధించిన వ్యక్తల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా వీరిలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా కూడా ఉండటంతో ఈ కేసు వివరాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ తనయ కవిత పేరు కూడా వినిపించడంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా ఈ కేసుపై ఆసక్తిని కనబర్చారు. అయితే ఇదివరకే జరిగిన సోదాల్లో ఢిల్లీ ఢిప్యూటీ సీఎం ఇంట్లో పెద్దగా ఏమీ లభ్యం కాలేదు.

కాగా ఆయనకు ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ సెక్టార్ లో గల వసుంధర బ్రాంచ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓ లాకర్ ఉందని.. దానిని తెరిచేందుకు ఇవాళ సీబిఐ అధికారులు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జ‌రిగిన సోదాల్లో త‌ాను, తన కుటుంబం ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని సీబిఐ నుంచి క్లీన్ చిట్ ల‌భించిందని అన్నారు. ఈ క్రమంలో ఆయన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని ల‌క్ష్యంగా చేసుకుని సెటైర్‌లు వేశారు. ప్ర‌ధాని చేయించిన ద‌ర్యాప్తులో సీబీఐ అధికారుల‌కు త‌న ఇంట్లోగానీ, బ్యాంకు లాక‌ర్‌లోగానీ ఏమీ ల‌భించ‌లేద‌ని వ్యాఖ్యానించారు.

త‌న లాక‌ర్‌లో త‌న భార్య‌, పిల్ల‌ల‌కు సంబంధించిన రూ.70 వేల విలువ చేసే ఆభ‌ర‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని సిసోడియా చెప్పారు. ప్ర‌ధాన మోదీ నా ఇంట్లో సోదాలు చేయించినా, నా లాక‌ర్‌ను త‌నిఖీ చేయించినా ఏమీ దొర‌క‌లేద‌ని, ఇది త‌న‌కు చాలా సంతోషాన్నిచ్చింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌ధాని ఆదేశాల‌తో జ‌రిగిన అన్ని సోదాల్లో త‌న కుటుంబానికి, త‌న‌కు క్లీన్ చిట్ ల‌భించింద‌న్నారు. సోదాల సంద‌ర్భంగా సీబీఐ అధికారులు డీసెంట్‌గా వ్య‌వ‌హ‌రించార‌ని సిసోడియా చెప్పారు. త‌న ఇంట్లో ఏమీ ఉండ‌వు, దొర‌క‌వు అని సీబీఐ అధికారుల‌కు ముందే తెలుస‌ని, అయినా ప్ర‌ధాని మోదీ ఒత్తిడితో సోదాలు చేశార‌ని వ్యాఖ్యానించారు. సోదాల్లో ఏమైనా దొరికితే త‌న‌ను కొన్ని నెల‌లు జైల్లో పెట్ట‌వ‌చ్చ‌ని ప్ర‌ధాని భావించార‌ని, కానీ ఆయ‌న అనుకున్న‌ట్లుగా జ‌రుగ‌లేద‌ని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles