Indigo Flight Delayed by 6 Hours After Bomb Hoax తాగుబోతు తుంటరి పనితో.. దుబాయ్ వెళ్లాల్సిన విమానం..

Drunk man s hoax bomb threat delays indigo s chennai dubai flight by 6 hours

Dubai, Chennai, IndiGo flight, Anna International Airport, Meenambakkam, flight delayed, bomb threat, hoax bomb threat, fake bomb threat, airport authorities, Search operation, IndiGo flight 6E 65, Airport Police Station, Bomb Detection and Disposal Squad (BDDS), Chennai, Tamil Nadu, Crime

A Dubai bound IndiGo flight was delayed for nearly 6 hours after it received a hoax bomb threat. The IndiGo flight (6E 65) which was supposed to depart at 7:20 am was delayed after authorities received a bomb threat over phone at 6:15 am. Airport Police Station and Bomb Detection and Disposal Squad (BDDS) swung into action immediately after the call.

తాగుబోతు తుంటరి పనితో.. దుబాయ్ వెళ్లాల్సిన విమానం..

Posted: 08/27/2022 06:34 PM IST
Drunk man s hoax bomb threat delays indigo s chennai dubai flight by 6 hours

ఓ తాగుబోతు మనస్సును నోప్పిస్తే ఇలా కూడా చేస్తారా.? అన్న అలోచన సామాన్య ప్రజల్లో ఉత్పన్నమయ్యేలా చేసిన ఘటన ఇది. తాగుబోతు చేసిన తుంట‌రి ప‌నితో చెన్నై నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లాల్సిన విమానం ఆగిపోయింది. ఇక ఇదిగో విమానం బయలుదేరుతుందనగా.. వచ్చిన ఓ ఫోన్ కాల్ తో విమానం కాస్తా ఆగిపోయింది. ఫోన్ కాల్ కు తాగుబోతుకు ఏంటీ సంబంధం.. కొంపదీసి పీకల వరకు తాగేసి విమానం సకాలంలో అందుకోవడం లేటయ్యిందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.? అదేం లేదు ఆయన తన ఇంట్లోనే ఉన్నాడు.

మరి ఎందుకని విమానం ఆగిపోయింది. అసలు ఫోన్ కాల్ ఏమని వచ్చింది. అనేగా మీ సందేహం. ఆ ఫోన్ కాల్ తో ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను ఉరుకులు ప‌రుగులు పెట్టేలా చేసింది. ఔనా, మ్యాటర్ మాకు అవగతం అవుతోంది. అదేనా అంటే అచ్చంగా మీ అనుమానం కరెక్టే. విమానంలో బాంబు పెట్టామని ఆ తాగుబోతు ఎయిర్ పోర్టుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. తన ఇంట్లోనే ఉన్న తాగుబోతుకు విమానానికి ఏంటీ సంబంధం. అసలెందుకు ఇలా ఫోన్ చేయాల్సివచ్చింది అంటారా.? ఈ తాగుబోతు కుటుంబానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు శ‌నివారం ఉద‌యం దుబాయ్ వెళ్లేందుకు ఇంటి నుంచి బ‌య‌లుదేరారు.

అయితే వాళ్లు ఈ రోజు దుబాయ్‌కి వెళ్ల‌డం తాగుబోతుకు ఇష్టం లేదు. కానీ, వాళ్లు అత‌ని మాట‌ను ప‌ట్టించుకోకుండా ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. దాంతో వాళ్ల‌ను ఎలాగైనా దుబాయ్ వెళ్ల‌కుండా ఆపాల‌ని తాగుబోతు ప్లాన్ చేశాడు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి స‌ద‌రు విమానంలో బాంబు ఉంద‌ని చెప్పాడు. దాంతో అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టి బాంబు లేద‌ని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. దీంతో దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆరు గంటలు ఆలస్యంగా బ‌య‌లుదేరింది. ఇక‌ ఫోన్ కాల్ ను ట్రేస్ చేసిన పోలీసులు తాగుబోతును విచారించగా త‌మ కుటుంబ‌స‌భ్యుల‌ను దుబాయ్ వెళ్ల‌కుండా ఆపేందుకే ఆ ప‌ని చేశాన‌ని చ‌ల్ల‌గా చెప్పాడు. దాంతో ముక్కున వేలేసుకోవ‌డం పోలీసుల వంత‌య్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles