3 Indian students killed in road crash in Scotland రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Police scotland issue appeal as 3 indian students killed in road crash

Pavan Bashetty, Girish Subramanyam, Bengaluru, Aeronautical Engineering students, Sudhakar Modepalli, Nellore, Sai Varma, Mechanical Engineering, Leicester University, Queen Elizabeth University Hospital, Glasgow, silver Honda Civic, black heavy goods vehicle (HGV), 3 Indians killed, road traffic offence, fatal road crash, Appin area, Argyll, Scottish Highlands, Indian National Students’ Association (INSA) UK, Crime

The police in Scotland are appealing for information as they investigate the circumstances surrounding a road accident that resulted in the death of three Indians, while a fourth Indian national remains in hospital in critical condition. Pavan Bashetty from Hyderabad and Girish Subramanyam from Bengaluru, both 23, were both Aeronautical Engineering students studying for a Master’s degree at the University of Leicester.

స్కాట్లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గరు భారతీయ విద్యార్థుల మృతి

Posted: 08/24/2022 12:37 PM IST
Police scotland issue appeal as 3 indian students killed in road crash

స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులతో పాటు మరో భారతీయ విద్యార్థి దుర్మరణం చెందారు. స్కాట్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు తెలుగు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరుకు చెందిన మరో విద్యార్థి కూడా మృతి చెందాడు. ఉన్నత విద్య అభ్యసించేందుకని విదేశాలకు వెళ్లిన బిడ్డలు.. ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులు బాసారని తెలిసి ఇక్కడ వారి తల్లిదండ్రులు. హతాశులయ్యారు. భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖ అధికారులు తమ బిడ్డల పార్థీవ దేహాలను దేశానికి తరలించేందుకు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. స్కాట్లాండ్‌ లో ఉన్నత విద్య అభ్యసించేందుకని వెళ్లిన భారత విద్యార్థులు.. వీకెండ్ నేపథ్యంలో సమీపంలోని పర్యాటక ప్రాంతానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే వారితో పాటు వారికి సీనియర్ అయిన సుధాకర్ అనే యువకుడు అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అతనితోపాటు ముగ్గురు విద్యార్థులు ఈ నెల 19న తమ కారులో బయలుదేరి వెళ్లారు. ఇలా ప్రయాణిస్తుండగా.. అప్పిన్‌ ప్రాంతంలో వారి కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో భారీ వాహనాన్ని ఢీకొనింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా రక్తస్రావం కావడంతో మరణించారు. కాగా, ఒకరి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది.

హైదరాబాద్‌కు చెందిన పవన్‌ బాశెట్టి (23), నెల్లూరుకు చెందిన సుధాకర్‌(30)తోపాటు బెంగళూరుకు చెందిన గిరీష్‌ సుబ్రహ్మణ్యం(23)లు మృతి చెందారు. హైదరాబాద్‌లోని చంపాపేట్ కు చెందిన మరో విద్యార్థి సాయి వర్మ (24)కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు అక్కడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో పవన్‌, సుబ్రహ్మణ్యంలు లైసెస్టర్‌ యూనివర్సిటీలో ఎరోనాటికల్‌ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుధాకర్‌ ఇప్పటికే మాస్టర్స్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అతని కారులోనే విద్యార్థులు కలసి బయల్దేరగా అనుకోకుండా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సాయివర్మ కూడా ఇదే యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈ ఘటనపై స్కాట్లాండ్ అధికారులు స్పందించారు. విద్యార్థులు వెళ్తున్న కారును భారీ వాహనం ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ 47 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles