UP Man Wins 22-year-long Legal Suit Against Railways రూ.20 కోసం 22 ఏళ్ల పోరాటం.. రైల్వేపై గెలిచిన ప్రయాణికుడు

Up lawyer wins 21 year long legal battle with indian railways over rs 20

Lawyer from Mathura, Mathura lawyer, Advocate Tungnath Chaturvedi, Consumer Forum, Indian Railways, Mathura Cantt station, Moradabad, booking clerck, North Eastern Railway Gorakhpur, General Manager, Gali Pirpanch, Mathura, Uttar pradesh

A lawyer from Mathura waged and won a legal battle in the consumer forum for 21 long years against Indian Railways which charged him Rs 20 extra. Now, after more than two decades of fighting in court, the Consumer Forum has ruled in favour of the lawyer. The matter dates back to December 25, 1999 when Advocate Tungnath Chaturvedi, resident of Gali Pirpanch of Mathura reached Mathura Cantt station to take a train to Moradabad.

రూ.20 కోసం 22 ఏళ్ల న్యాయపోరాటం.. రైల్వేపై కేసు గెలిచిన ప్రయాణికుడు

Posted: 08/12/2022 06:16 PM IST
Up lawyer wins 21 year long legal battle with indian railways over rs 20

చిన్న మొత్తమే కదా.. పోనిద్దురూ అంటూ ఎందరకు ఎన్ని రకాలుగా చెప్పినా.. పోరాట యోధులు.. తమలోని శక్తినంతా కూడగట్టుకుని సలిపే పోరాటంలో సాధించే విజయం.. వారి వ్యక్తిగతం కాదు.. ప్రజాప్రయోజనం ఇమిడి ఉందని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పోరాట యోధుల కారణంగానే నగరంలో పార్కింగ్ ఫీజుల మాఫియాకు కళ్లెం పడింది. వీరి పోరాటం ఫలితంగానే థియేటర్లలో తినుబండారాలపై అడ్డగోలు దోపిడి అంతమయ్యింది. వీరి కారణంగానే అనేక హోటళ్లు, దుకాణాల్లో వాటర్ బాటిళ్ల ధరపై అధికంగా చేసే వసూళ్లకు చెక్ పడింది. వీరి కారణంగానే దుకాణాలు, మాల్ లలో లభించే క్యారీ బ్యాగుల వసూళ్లలపై కొరడా జుళిపించింది.

ఇలాంటి పోరాటాన్నే గత 22 ఏళ్లుగా కొనసాగిస్తున్న మరో యోధుడు చివరకు విజేతగా నిలిచాడు. రూ.20 కోసం 22 ఏళ్లు కోర్టు చుట్టూ తిర‌గ‌డం కాస్త విచిత్రంగానే క‌నిపిస్తుంది. కానీ, న్యాయం బ‌తికుంద‌ని చెప్ప‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ అంటున్నారు తుంగనాథ్ చతుర్వేది. దీని కోసం రైల్వేతో 22 ఏళ్లు చేసిన‌ న్యాయ పోరాటంలో విజయం సాధించాడు. వివ‌రాల్లోకి వెళితే, 1999లో, చతుర్వేది ఉత్తరప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్ల‌కు 20 రూపాయలు అదనంగా తీసుకున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆయ‌న క‌న్జ్యూమ‌ర్‌ కోర్టులో నార్త్ ఈస్ట్ రైల్వేకు వ్యతిరేకంగా కేసు వేశారు.

ఈ కేసుకు సంబంధించి ఆయ‌న‌ 100 కంటే ఎక్కువ విచారణలకు హాజరయ్యాడు. అయితే, రైల్వేకు వ్యతిరేకంగా ఫిర్యాదులను రైల్వే ట్రిబ్యునల్‌కు పరిష్కరించాలని, వినియోగదారుల కోర్టుకు కాదని రైల్వే కేసును కొట్టివేయించేందుకు ప్రయత్నించింది. కానీ, స్వ‌యంగా న్యాయ‌వాది అయిన చ‌తుర్వేది, 2021 సుప్రీం కోర్ట్ తీర్పును బ‌ట్టి ఈ కేసు వినియోగదారుల కోర్టులో విచారించవచ్చని నిరూపించారు. ఇక‌, 22 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, వినియోగదారుల‌ కోర్టు ఆయనకు సానుకూలంగా తీర్పును వెలువరించింది.

బాధితున‌కు 15,000 రూపాయలు జరిమానా చెల్లించాలని, సంవత్సరానికి 12 శాతం వడ్డీతో 20 రూపాయలను అతనికి తిరిగి చెల్లించాలని రైల్వేని ఆదేశించింది. నిర్ణీత 30 రోజులలోపు చెల్లించకపోతే వడ్డీ రేటును 15 శాతానికి పెంచుతామని కోర్టు పేర్కొంది. దీనిపై చతుర్వేది స్పందిస్తూ, "డబ్బు ముఖ్యం కాదు, ఇది న్యాయం కోసం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం. క‌నుక‌ ఇది విలువైనది" అని అన్నారు. అలాగే, "నేను స్వయంగా న్యాయవాదిని కాబట్టి, న్యాయవాదికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్టుకు వెళ్లడానికి అయ్యే ఖర్చును భరించాల్సిన అవసరం లేదు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అది చాలా ఖరీదైంది కావచ్చు," అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh