స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలు ఉంటాయని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల హెచ్చరించిన క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అజాదీకే అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్న స్వాత్రంత్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్రమత్తమైన పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పదివేల మంది బలగాలను పోలీసులు మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు ఎగురవేయకుండా అడ్డుకునేందుకు 400 మంది సైనికులను ప్రత్యేకంగా నియమించారు.
ఎర్రకోట, ఢిల్లీ పోలీస్ కమాండోల చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలను స్వాధీనం చేసుకొని.. వాటిపై షూటర్లను మోహరించనున్నారు. అలాగే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న రోహింగ్యాల కాలనీలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 15న భూమి నుంచి ఆకాశం వరకు అన్నింటిపై నిఘా వేస్తామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ దీపేందర్ పాఠక్ పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చిన సమాచారం మేరకు.. అన్ని భద్రతా సంస్థల సమన్వయంతో ఎర్రకోట వద్ద సెక్యూరిటీ సర్కిల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సారి ఎర్రకోట చుట్టుపక్కల నో ఫ్లయింగ్ జోన్ అమలులో ఉంటుందని.. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురడంపై నిషేధం ఉంటుందన్నారు.
అలాగే వెయ్యికిపైగా అత్యాధునిక సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కెమెరాలతో సందర్శకులపై నిఘా వేయనున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని.. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. మరో వైపు ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేసి.. తనిఖీలు చేపట్టనున్నారు. 15న రోహింగ్యాల కాలనీల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు ఆయా కాలనీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more