Daily wage earner becomes billionaire for few hours కోటీశ్వరుడిగా మారిని కూలీ.. ఖాతాలోకి రూ.2700 కోట్లు..

Daily wage earner turns billionaire for a few hours with rs 2 700 cr in his jan dan account

daily wage labourer, bihari lal, billionaire, bank SMS, brick kiln unit, Rajasthan, Jan seva kendra, bank mitra, Jan Dhan Account, bank of india, Kannauj district, Uttar Pradesh, Viral news

Bihari Lal (45) a daily wage labourer who works at a brick kiln unit in Rajasthan, withdrew Rs 100 from his Jan Dhan account in Bank of India from a Jan Seva Kendra in his village. Minutes later, he received an SMS that showed a balance of Rs 2,700 crore in his account. He was at his native place in Uttar Pradesh's Kannauj district as the brick kiln unit was shut due to the monsoon.

కోటీశ్వరుడిగా మారిన కూలీ.. ఖాతాలోకి రూ.2700 కోట్లు.. అంతలోనే అవిరి..

Posted: 08/04/2022 09:04 PM IST
Daily wage earner turns billionaire for a few hours with rs 2 700 cr in his jan dan account

ఒక కూలీకి కోటీశ్వరుడయ్యాడు. అంతలోనే అతని విధి రాత మారిపోయింది. కొన్ని గంటల పాటు ఉన్న ఈ ఆనందం ఆ తరువాత హరించుకుపోయింది. అందుకు కారణం బ్యాంకు అధికారులే. కూలికి చెందిన బ్యాంకు అకౌంట్లో ఒకటి రెండు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలను వేశారు. ఇందుకు సంబంధించిన మెసేజ్ అతనికి చేరింది. దీంతో తొలుత షాకైన కూలీ.. బ్యాంకుకు వెళ్లి కొద్దిగా డబ్బు తీసుకుందామని భావించేలోపు సంతోషం పోయి సన్నగిల్లపడ్డాడు. కూలికి చెందిన జన్‌ధన్‌ ఖాతాలో పడిన వేల కోట్ల రూపాయలు వచ్చినట్టే వచ్చి.. అంతలోనే చేజారిపోయాయి.

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. 45 ఏళ్ల బీహారీ లాల్ రాజస్థాన్‌లోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. రోజుకు రూ.600 నుంచి రూ.800 సంపాదించేవాడు. అయితే వర్షాల వల్ల ఆ ఇటుక బట్టీ మూతపడింది. దీంతో అతడు కన్నౌజ్‌ జిల్లాలోని సొంత ఊరికి ఇటీవల తిరిగి వచ్చాడు. కాగా, బీహారీ లాల్‌ రెండు రోజుల కిందట స్థానిక జన సేవా కేంద్రానికి వెళ్లాడు. తన జన్‌ధన్‌ బ్యాంకు ఖాతా నుంచి వంద రూపాయలు డ్రా చేశాడు. ఆ వెంటనే వచ్చిన మెసేజ్ తో అతనికి అసలు విషయం తెలిసింది.

అతడి మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో తన బ్యాంకు ఖాతాలో రూ.2,700 కోట్లు బ్యాలెన్స్‌ ఉన్నట్లు గమనించాడు. వెంటనే బ్యాంకు మిత్రా సిబ్బంది వద్దకు వెళ్లాడు. తన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయో చూడాలని కోరాడు. మరోవైపు బ్యాంక్‌ మిత్రా వ్యక్తి బీహారీ లాల్‌ బ్యాంకు ఖాతాను ఒకటికి మూడుసార్లు పరిశీలించాడు. అతడి జన్‌ధన్‌ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నాయని చెప్పాడు. దీనికి సంబంధించిన అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ కూడా ప్రింట్‌ తీసి ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా కోటీశ్వరుడు కావడంపై బీహారీ లాల్‌ ఆశ్చర్యపోవడంతోపాటు సంబరపడిపోయాడు.

అయితే అతడి ఆనందం కొన్ని గంటల్లో ఆవిరైంది. బీహారీ లాల్‌ ఆ తర్వాత తన బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాడు. అక్కడ జన్‌ధన్‌ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.126 మాత్రమే ఉండటం చూసి నిరాశ చెందాడు. తన ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్లు మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌తోపాటు స్టేట్‌మెంట్‌ ప్రింట్‌ను బ్యాంకు అధికారికి చూపించాడు. అయితే బ్యాంకింగ్‌ పొరపాటు వల్ల ఇలా జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దర్యాప్తు కోసం బీహారీ లాల్‌ బ్యాంక్‌ ఖాతాను కొంతసేపు స్తంభింపజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles