Biden announces death of Al-Qaeda chief al-Zawahiri అల్ ఖైదాకు భారీ ఎదురుదెబ్బ.. అధినేత అల్ జవహరి హతం

Al qaeda chief ayman al zawahiri killed in airstrike claims us president joe biden

Ayman al-Zawahiri, United States, Joe Biden, Kabul, Al-Qaeda, Osama Bin Laden, 9/11 attacks, White House, al jawahiri, al qaeda chief, kabul, ayman al zawahiri, al zawahiri, al qaeda leader, afghanistan, afghanistan news, al qaeda chief, drone strike, united states,joe biden

Security forces in the United States have killed Al-Qaeda leader Ayman al-Zawahiri in an airstrike in Kabul, President Joe Biden claimed. Al-Zawahiri had been accused of plotting the September 11, 2001, terrorist attacks, also known as 9/11, in the United States along with former Al-Qaeda chief Osama Bin Laden.

అల్ ఖైదాకు భారీ ఎదురుదెబ్బ.. అధినేత అల్ జవహరి హతం

Posted: 08/02/2022 11:59 AM IST
Al qaeda chief ayman al zawahiri killed in airstrike claims us president joe biden

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అయ్‌మన్ అల్‌జవహరి హతమయ్యాడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్‌ను 2011లో హతమార్చిన అమెరికా తాజాగా మరోమారు అల్ ఖైదాను కోలుకోలేని దెబ్బకొట్టింది. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీని తుదముట్టించింది. అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబూల్‌పై చేసిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో అల్‌జవహరి హతమైనట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా పకడ్బందీ ప్రణాళికతో జరిపిన డ్రోన్ దాడిలో జవహరి హతమైనట్టు అమెరికా అధికారులు ‘రాయిటర్స్’కు తెలిపారు.

ఆదివారం జరిపిన డ్రోన్ దాడిలో జవహరి హతమైనట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. అమెరికా డ్రోన్ దాడిపై తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. డ్రోన్ దాడి జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారిస్తూనే తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహరిని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న మాట్లాడుతూ.. ‘విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’గా అభివర్ణించారు. కాగా, 11 సెప్టెంబరు 2001లో అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా జరిపిన దాడిలో దాదాపు 3 వేల మంది మరణించారు.

ఈ దాడి సూత్రధారుల్లో అల్ జవహరి కూడా ఒకరని అమెరికా గుర్తించింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత ఉగ్రవాద సంస్థ పగ్గాలను జవహరి అందుకున్నాడు. న్యాయం జరిగిందని, ఈ ఉగ్రవాద నేత ఇక లేడని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ‘‘అల్‌ఖైదా నేత అల్‌జవహరి హతమయ్యాడు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్న వదలం. ఎంతకాలమైనా ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం’’ అని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles