Modi inaugurates 100 MW floating solar project at Ramagundam సోలార్ పవర్ ప్రాజెక్టుకు జాతికి అంకితమిచ్చిన ప్రధాని

Pm modi dedicated ramagundam 100 megawatt floating solar power plant to nation

‘Ujjwal Bharat Ujjwal Bhavishya Power @ 2047’, 100-megawatt solar power project, National Thermal Power Corporation, Telangana’s floating solar plant, Solar panel, 100-megawatt solar power project, NTPC, PM Modi, Inaguration, Ramagundam, Telangana

India’s largest floating solar plant is now fully operational at Ramagundam in Telangana’s Peddapalli district. Prime Minister Narendra Modi dedicated to the nation in virtual mode the 100 MW floating solar PV project at Ramagundam. The 100-megawatt (MW) floating solar power photovoltaic project was commissioned by the National Thermal Power Corporation, the country’s foremost public-sector power generator.

రామగుండం సోలార్ పవర్ ప్రాజెక్టుకు జాతికి అంకితమిచ్చిన ప్రధాని

Posted: 07/30/2022 03:51 PM IST
Pm modi dedicated ramagundam 100 megawatt floating solar power plant to nation

నీటిపై తేలియాడే సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల్లో దేశంలోనే అతి పెద్ద‌దైన ప్రాజెక్టు తెలంగాణ‌లోనే ఆవిష్కృత‌మైంది. కేంద్రప్రభుత్వ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్మతమైన ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టింది. కాగా, ఈ ప్రాజెక్టును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ‘‘ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య@2047’’ పథకంలో భాగంగా ఈ ప్రాజక్టును నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును జాతికి అంకితమిస్తున్న సందర్భంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు తెలంగాణ‌లో ఆవిష్కృతం కావ‌డం సంతోషంగా ఉంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.

ఈ మేరకు ప్రాజెక్టును ప్ర‌ధాని ప్రారంభించ‌డానికి కాస్తంత ముందుగా ప్రాజెక్టు వివ‌రాల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలోని ఎన్టీపీసీ జ‌లాశ‌యంలో 600 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటైన‌ట్లు కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. 100 మోగావాట్ల సామ‌ర్థ్యంలో రూ.423 కోట్ల‌తో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మేక్ ఇన్ ఇండియా క్రింద దేశంలోనే తయారు చేసిన 4.5 లక్షలకు పైగా సోలార్ ప్యానెళ్లతో 40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుందని ఆయ‌న వివ‌రించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ ను సరఫరా చేయవచ్చని కిష‌న్ రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టు వలన సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుంద‌న్న కిష‌న్ రెడ్డి.. ఈ ప్రాజెక్టుల వ‌ల్ల‌ 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నిరోధిస్తుందని వివ‌రించారు. ఇటువంటి పర్యావరణ సహిత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండటం మనందరికీ గర్వకారణని ఆయ‌న పేర్కొన్నారు. రామగుండం అంటే విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గును అందించే ప్రాంతంగా ఉన్న గుర్తింపును ఇకపై విద్యుత్ ఉత్సాదకతగా మారుతుందని కిషన్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles