SBI changes rules; enables OTP-based cash withdrawal from ATM ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయాలంటే.. మొబైల్ తప్పనిసరి!

Sbi enables otp based atm withdrawal service for transactions over rs 10 000

State Bank of India, State Bank of India ATM rules, sbi atm rules, sbi atm changes, sbi atm new rules, sbi atm withdrawal rules, sbi atm withdrawal guidelines, sbi latest update, ATM frauds, SBI ATM, SBI ATM rules, Mobile Phone, Account based withdrawl, Cyber Crime

The country's largest public sector bank, the State Bank of India (SBI), has implemented a one-time password-based (OTP-based) cash withdrawal service. In a bid to protect the customers against ATM frauds, a withdrawal of or more than Rs 10,000 will now be possible only by entering the OTP in the ATM.

ఎస్బీఐ కొత్త నిబంధనలు: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయాలంటే.. మొబైల్ తప్పనిసరి!

Posted: 07/27/2022 02:54 PM IST
Sbi enables otp based atm withdrawal service for transactions over rs 10 000

భారతీయ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేటు బ్యాంకు ఆఫ్ ఇండియా సైబర్ నేరగాళ్లకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది. నగరంతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్ష్యరాసుల నుంచి మేధావుల వరకు ఎంతోమంది సైబర్ నేరగాళ్ల బారిన పడి తాము కష్టపడిన సొమ్మును కోల్పోతున్నారు. దీంతో ఇప్పటికే సాధారణ డెబిట్ కార్డుల స్థానంలో చిప్ తో కూడిన డెబిట్ కార్డులను వినియోగంలోకి తీసుకువచ్చిన ఎస్బీఐ.. తాజాగా మరో మెలికను కూడా పెట్టింది. ఇకపై తమ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రాల నుంచి రూ. 10 వేలకు మించి నగదును ఉపసంహరించుకోవాలంటే తప్పనిసరిగా మొబైల్ కూడా తీసుకెళ్లాల్సిందేనని సూచనలు చేసింది.

ఈ మేరకు స్టేట్‌బ్యాంకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులను కాపాడే లక్ష్యంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్టు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎం నుంచి రూ. 10 వేలను మామూలుగా తీసుకోవచ్చు. ఆపై మాత్రం నగదు తీసుకోవాలంటే బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు పెట్టి పిన్ నొక్కగానే ఆ మొబైల్‌కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తేనే డబ్బులు డ్రా చేసుకునే వీలుంటుంది. ఈ ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పరిమితం. కాగా, ఇదే నిబంధనను ఇతర బ్యాంకులు కూడా అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles