Jhunjhunwalas Akasa Air to take off from August 7 ఆగస్టు 7న గగనయానానికి 'ఆకాశ ఎయిర్‌' రెడీ.!

Akasa air taking to skies for it s maiden flight from mumbai to ahmedabad on aug 7

Rakesh Jhunjhunwala, Akasa Air, flights, Mumbai-Ahmedabad, Indigo, Delhi airport, Akasa air flight fare, Vinay Dube, Aditya Ghosh, air ticket sales, air ticket, flight ticket sale, Akasa Air tickets on sale

Rakesh Jhunjhunwala-backed Akasa Air announced that it will commence commercial operations on August 7, connecting four cities — Mumbai, Ahmedabad, Bengaluru and Kochi — through 56 weekly flights in the first phase. The budget carrier will start 28 weekly flights between Mumbai and Ahmedabad from August 7. Another 28 weekly flights will be offered between Bengaluru and Kochi from August 13.

ఆగస్టు 7న గగనయానానికి 'ఆకాశ ఎయిర్‌' రెడీ.! దశలవారీగా ఇతర ప్రాంతాలకు..

Posted: 07/23/2022 10:33 AM IST
Akasa air taking to skies for it s maiden flight from mumbai to ahmedabad on aug 7

విమాన సేవలు అందించేందుకు మరో కొత్త సంస్థ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించేందుకు మర పక్షం రోజుల వ్యవధిలో ఈ సంస్ధ విమానయాన రంగంలో అరంగ్రేటం చేయనుంది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న 'ఆకాశ ఎయిర్‌' ఆగస్టు 7న తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తమ సంస్థ తొలి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే టికెట్‌ బుకింగ్‌లు ప్రారంభించినట్లు తెలిపింది.

విమానయాన రంగంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలు అరంగ్రేటం చేసి.. తమతో కాదని.. తమ సర్వీసులను అమ్ముకోవడమో లేక తాత్కాలికంగా నిలిపివేయడమో చేస్తుండగా, ఆకాశ ఎయిర్ మాత్రం వాణిజ్య భవిష్యత్తును వెతుక్కుంటూ.. ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య కూడా సేవలు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కూడా టికెట్లు ఇప్పటి నుంచే బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది.

ఇప్పటికే ఒక విమానం భారత్‌కు చేరుకుంది. మరొకటి ఈ నెలాఖరు వరకు కంపెనీ చేతికి అందనుంది. దశలవారీగా ఇతర నగరాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రవీణ్‌ అయ్యర్‌ తెలిపారు. ఈ ఏడాది ప్రతినెలా తమ కంపెనీకి రెండు కొత్త విమానాలు అందుతాయని పేర్కొన్నారు. విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ నుంచి ఈ నెల 7న ఆకాశ ఎయిర్‌ 'ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌' అందుకుంది. మొత్తం 72 మ్యాక్స్‌ విమానాల కోసం కంపెనీ గత ఏడాది నవంబరులో బోయింగ్‌తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakesh Jhunjhunwala  Akasa Air  flights  Mumbai-Ahmedabad  Indigo  Delhi airport  Akasa air flight  aviation  ATC  

Other Articles