27 people travelling in one auto stump policemen ఒక్క అటో రిక్షాలో ఇంత మందిని చూసి పోలీసులే షాక్.!!

27 people travelling in one auto stump policemen in uttar pradesh

27 people travelling in one auto, 27 people in one auto rickshaw, 27 people in Auto rickshaw, 27 people in Auto at Fatehpur, 27 people in Auto at Fatehpur of Uttar Pradesh, Auto Rickshaw, Eid al-Adha, Bakrid, auto, 27 people, offering prayers, Uttar Pradesh police, social media, Fathepur, Uttar Pradesh

The Uttar Pradesh policemen were astonished when they witnessed 27 people travelling in an auto in Fatehpur. When the cop asked them, they replied that they were returning after offering prayers of Eid al-Adha. A video of the same is being widely shared on social media.

ITEMVIDEOS: ఒక్క అటో రిక్షాలో ఇంత మందిని చూసి పోలీసులే షాక్.!!

Posted: 07/11/2022 09:34 PM IST
27 people travelling in one auto stump policemen in uttar pradesh

ఆటోలో ప్రయాణం ఎంతో ప్రమాదకరం అన్న స్థితి నుంచి అటోలో ప్రయాణం కూడా ఒక భాగం అన్న స్థాయికి చేరుకున్నాం. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందాం. రోడ్లు కూడా విశాలంగా మారాయి. అయితే అటోలలో అధికమంది లైన్సెన్సు కలిగిన వారు డ్రైవర్లు ఉండటంతో ప్రమాదాలు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే ఒక్కోసారి అటోలు అదుపు తప్పడం అన్నది చూస్తూనే ఉన్నాం. అందుకు కారణం ఆటో డ్రైవర్ల అతివేగం.. లేదా అదుపు తప్పేలా అటోల్లో ప్యాసింజర్లను ఇరికించి మరీ కూర్చోబెట్టడం కూడా కావచ్చు. నగరావాసులకు వినడానికే విచిత్రంగా ఉన్నా.. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో మాత్రం ఈ పరిస్థితి నెలకొన్నదన్నది కాదనలేని సత్యం.
 
అటోలో డ్రైవరు కలుపుకుని నలుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఆటోలో ఏకంగా ప‌ది మంది ప్ర‌యాణించ‌డం చూస్తుంటాం. డ్రైవర్ మరీ కక్కుర్తి పడేవాడే అయితే..ఏకంగా 12 మంది వారకు ప్రయాణిస్తారు. అంతేకానీ ఏకంగా గెన్నీస్ రికార్డు తరహాలో ఒక్క అటోలో ఏకంగా 27 మంది ప్రయాణించడం ఎక్కడైనా చూశారా.? ఉత్తర్ ప్రదేశ్ లో ఆ ఘట్టం కూడా అవిష్కృతమైంది. యూపీలోని ఓ ఆటో రిక్షాలో కూర్చున్న ప్యాసింజ‌ర్ల‌ను చూసి పోలీసులే షాక‌య్యారు. 7 సీట‌ర్‌లో ఏకంగా 27 మంది కూర్చొని ఉండ‌గా, ఓవ‌ర్‌స్పీడ్‌తో ప్ర‌యాణిస్తున్న ఆటోను ఆపి చూసిన పోలీసుల‌కు మ‌తిపోయింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఫతేపూర్‌లోని బింద్‌కీ కొత్వాలి ప్రాంతంలో ఈ ఆటో కనిపించింది. ఇందులో కేవ‌లం ఏడురుగు మాత్ర‌మే ప్రయాణించే సామర్థ్యం ఉండగా.. ఆ డ్రైవర్ వృద్ధులు, చిన్నారులు సహా 27 మందిని ఎక్కించాడు. అంగుళంకూడా గ్యాప్ లేకుండా అంద‌రూ ఇరికిరుకుగా కూర్చున్నారు. పోలీసులు వారంద‌రినీ కిందికి దించి లెక్కించారు. అనంత‌రం డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేశారు. ఈ వీడియోకు 85.1 వేల వ్యూస్ రాగా, 3వేల మంది షేర్ చేశారు. అంత‌మందితోనూ ఆ ఆటో ఓవ‌ర్‌స్పీడ్ వెళ్తోందంటే దీన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్కించాల్సేంద‌న‌ని ఓ నెటిజ‌న్ స‌ర‌దాగా కామెంట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles